‘రాధే శ్యామ్’గా రానున్న ప్రభాస్ ?

‘రాధే శ్యామ్’గా రానున్న ప్రభాస్ ?

Published on Jun 6, 2020 11:30 PM IST


రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుతున్న టీమ్ కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేశారు. మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను జూలై సెకెండ్ వీక్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో తీయనున్నారు.

దానికి సంబంధించిన సెట్ డిజైన్ కూడా మొదలుపెట్టారట. మిగిలిన షూటింగ్ మొత్తం దాదాపు ఫిల్మ్ సిటీలోనే తీస్తారట. ఈ లాక్ డౌన్ సమయంలో కూడా టైమ్ సేవ్ చెయ్యడం కోసం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు