తెలుగు రాష్ట్రాల్లో పెర‌గ‌నున్న ‘క‌ల్కి’ టికెట్ రేట్లు..?

తెలుగు రాష్ట్రాల్లో పెర‌గ‌నున్న ‘క‌ల్కి’ టికెట్ రేట్లు..?

Published on Jun 11, 2024 7:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న లేటెస్ట్ సెన్సేష‌న్ ‘క‌ల్కి 2898 AD’ కోసం ప్రేక్ష‌కులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందా అని అంద‌రూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక‌ ఈ సినిమా ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసే విధంగా ఉండ‌టంతో ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయిన ‘క‌ల్కి’ మూవీ టికెట్ రేట్లు భారీగా పెరిగే అవ‌కాశం క‌నిపిస్తుంది. తెలంగాణ‌తో పాటు ఏపీలోనూ ఈ టికెట్ రేట్లు పెర‌గ‌నున్నాయ‌ని సినీ స‌ర్కిల్స్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో టికెట్ రేట్లు మ‌ల్టిప్లెక్స్ ల‌లో రూ.413 గా, సింగిల్ స్క్రీన్స్ లో రూ.236 గా పెర‌గనున్నాయి.

అటు ఏపీలో ఈ టికెట్ రేట్ల‌ను రూ.206 నుంచి రూ.354 వ‌ర‌కు పెంచేందుకు చ‌ర్చ‌లు సాగుతున్నాయి. కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కానుండ‌టంతో ఈ చ‌ర్చ‌లు కొలిక్కి వ‌స్తాయ‌ని మేక‌ర్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్ర‌త్యేక బెనిఫిట్ షోలు కూడా వేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు