“హరిజోన్: ఆన్ అమెరికన్ సాగ” ప్రీమియర్ కి కన్నప్ప టీమ్…మరికొద్ది గంటల్లో టీజర్ రిలీజ్!

“హరిజోన్: ఆన్ అమెరికన్ సాగ” ప్రీమియర్ కి కన్నప్ప టీమ్…మరికొద్ది గంటల్లో టీజర్ రిలీజ్!

Published on May 20, 2024 6:50 PM IST

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. మరికొద్ది గంటల్లో ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప గ్లింప్స్ రిలీజ్ కానుంది. అయితే కన్నప్ప టీమ్ హరిజోన్: ఆన్ అమెరికన్ సాగ ప్రీమియర్ షో కి హాజరు అయ్యింది. మోహన్ బాబు, విష్ణు మంచు, ప్రభు దేవాలు హాజరు అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరికొద్ది గంటల్లో ఒలింపియా ధియేటర్ లో కన్నప్ప టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మోహన్ బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ టీజర్ లో వీరి రోల్స్ మరియు లుక్స్ రివీల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పనిచేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు