బజ్: ప్రభాస్ “కల్కి” లో ఈ విధంగా భాగమైన కీర్తి సురేష్!

బజ్: ప్రభాస్ “కల్కి” లో ఈ విధంగా భాగమైన కీర్తి సురేష్!

Published on May 18, 2024 7:21 PM IST

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కల్కి 2898 ADలో భాగం అయ్యింది. ఈ చిత్రంలో ప్రభాస్ బుజ్జి అనే ప్రత్యేక కారును ఉపయోగించాడు మరియు ఈ ప్రత్యేకమైన వాహనానికి కీర్తి సురేష్ తన వాయిస్ ఓవర్ ను అందించింది. ప్రత్యేక కారు కథానాయకుడికి సలహాలు ఇస్తూనే ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కల్కి 2898 ADలో దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, నాని మరియు విజయ్ దేవరకొండ అతిధి పాత్రలు పోషిస్తారని చాలా కాలంగా ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ ఉంది. తాజాగా కీర్తి సురేష్‌ పై రూమర్ వైరల్ అవుతోంది.

ఈ రూమర్స్ అన్నీ నిజమైతే సినిమా మరో లెవెల్ లో ఉండనుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కల్కి 2898 AD లో ప్రభాస్ భైరవ మరియు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ ఈ చిత్రం ను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు