కెవ్వు కేక కాంబినేషన్ లో మరోసారి హరీష్ శంకర్ పోస్ట్ వైరల్

మన టాలీవుడ్ లో సాంగ్స్ కూడా సినిమాల్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ఒకొక్క సాంగ్ ని వదులుతున్నారు అని ఒక పది పన్నెండేళ్ళు వెనక్కి వెళ్తే ఆల్బమ్ అంతా ఒకేసారి వచ్చేది. అలా వాటిలో ఒకో సాంగ్ ఆఫ్ లైన్ లో ఫ్యాన్స్ ని ఊపేసేవి. మరి అలా ఓ రేంజ్ లో ఆడియెన్స్ ని ఊపేసిన సాంగ్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ నుంచి గబ్బర్ సింగ్ లో సాంగ్ కెవ్వు కేక కూడా ఒకటి.

మరి ఈ సాంగ్ తర్వాత మరోసారి అల్లు అర్జున్ (Allu Arjun) తో “డీజే” కి అస్మైక యోగం అనే సాంగ్ ని చార్ట్ బస్టర్ గా ఆ సాంగ్ రచయిత సాహితి అందించారు. అయితే ఈ రెండు సినిమాలతో పాటుగా ఇపుడు మూడోసారి హరీష్ శంకర్, సాహితీ గార్ల కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. మరి దీనిని హరీష్ శంకర్ ఎంతో ఆనందంగా పంచుకున్నారు.

“నీలాకాశం నీడన బిడియాలన్నీ వీడనా….. నీ కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చేయ్ నా“ అంటూ సాగే సాహిత్యం లైన్స్ ని పెట్టి రవితేజ “మిస్టర్ బచ్చన్” కోసం తాను మరోసారి సాహితి గారితో వర్క్ చేయడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నానని తమ నుంచి కెవ్వు కేక, అస్మైక యోగం లాంటి చార్ట్ బస్టర్స్ ఆల్రెడీ ఉన్నాయని హరీష్ గుర్తు చేసాడు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.