మొత్తానికి ఆల్ టైం టాప్ 5 లో నిలిచిన “కేజీయఫ్” టీఆర్పీ.!

మొత్తానికి ఆల్ టైం టాప్ 5 లో నిలిచిన “కేజీయఫ్” టీఆర్పీ.!

Published on Jul 16, 2020 7:06 PM IST


మన దేశంలోనే బిగ్గెస్ట్ మాస్ కల్ట్ క్లాసిక్ గా నిలిచిన చిత్రాల్లో కన్నడ నుంచి వచ్చిన “కేజీయఫ్ చాప్టర్ 1” కూడా ఒకటి. గత 2018లో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా విడుదల కాబడిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. దీనితో రాబోయే చాప్టర్ 2 పై భారీ అంచనాలు నమోదు అయ్యాయి. కానీ అందుకు మధ్యలో చాలా గ్యాప్ వచ్చేయడంతో ఆ గ్యాప్ ను తమ మొదటి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా చూసి ఎంజాయ్ చెయ్యమని మేకర్స్ తెలిపారు.

అప్పుడు సినిమాకు ఎంతైతే హైప్ తీసుకొచ్చి రిలీజ్ చేశారో ఇప్పుడు టెలివిజన్ స్క్రీన్ పైకి కూడా అలాగే ప్రమోట్ చేసారు. అంతలా ప్రమోట్ చేసిన ఈ చిత్రం తన మొట్ట మొదటి టెలికాస్ట్ లో ఊహించిన స్థాయి టీఆర్పీ రాబట్టకపోయినా తెలుగు డబ్బింగ్ సినిమాలలో ఆల్ టైం టాప్ 5 వ స్థానంలో నిలిచింది. స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యబడిన ఈ చిత్రం 11.9 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ సంపాదించి టాప్ 5 వ స్థానంలో నిలిచింది.

ఈ డబ్బింగ్ చిత్రాల జాబితాలో నెంబర్ 1 స్థానంలో తలైవర్ రజినీకాంత్ నటించిన స్కై ఫై మూవీ “రోబో” 19.04 టీఆర్పీ రాబట్టగా ఆ తర్వాత రెండో స్థానంలో విజయ్ ఆంటోనీ నటించిన “బిచ్చగాడు” చిత్రం 18.76 పాయింట్స్ తో నిలిచింది. ఇక మూడో స్థానంలో మళ్ళీ రజినీ నటించిన డిజాస్టర్ మూవీ “కబాలి” 14.52 టీఆర్పీ తో నిలవగా నాల్గవ స్థానంలో లారెన్స్ నటించిన హార్రర్ కామెడీ కాంచన 13.1 టీఆర్పీ పాయింట్స్ తో నిలిచింది. వీటన్నిటి తర్వాత కేజీయఫ్ చాప్టర్ 1 మన దగ్గర ఐదవ స్థానంలో నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు