ఇంటర్వ్యూ : లగడపాటి శ్రీధర్ – ‘గజినీ’, ‘భాషా’ తరహాలో సాగే రివెంజ్ డ్రామా ‘సికందర్’.

ఇంటర్వ్యూ : లగడపాటి శ్రీధర్ – ‘గజినీ’, ‘భాషా’ తరహాలో సాగే రివెంజ్ డ్రామా ‘సికందర్’.

Published on Aug 13, 2014 6:32 PM IST

Lagadapati-Srighar
‘ఎవడి గోల వాడిది’ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమై ఆ తర్వాత ‘స్టైల్’, ‘వియ్యాలవారి కయ్యాలు’, ‘స్నేహగీతం’, ‘పోటుగాడు’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన లగడపాటి శ్రీధర్ తన నిర్మాణ సంస్థలో త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్న సినిమా ‘సికందర్’. సూర్య, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించాం.. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) 10 సంవత్సరాలుగా సక్సెఫుల్ నిర్మాతగా డైరెక్ట్ సినిమాలు చేస్తున్న మీరు ఎందుకు మొదటి సారి డబ్బింగ్ సినిమాపై ఎందుకు ఆసక్తి చూపారు.?

స) లింగుస్వామితో నాకు 3 సంవత్సరాల సాన్నిహిత్యం ఉంది. ఆయన మీదున్న గౌరవం, అలాగే సూర్య అంటే ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాని డబ్ చేస్తున్నాను. వీటన్నిటితో పాటు టాప్ టెక్నీషియన్స్ ఇందులో పనిచేసారు. ఇలాంటి వాళ్ళందరితో కలిసి సినిమా చెయ్యాలి అంటే మన బడ్జెట్ పరంగా వర్కౌట్ అవ్వదు. కానీ ఇంతమంది స్టార్ నటీనటులు, స్టార్ టెక్నీషియన్స్ కలిసి నటించిన ఈ సినిమాని నేను తెలుగులో రిలీజ్ చేస్తుండడం లక్ అనుకుంటున్నాను.

ప్రశ్న) ‘సికందర్’ సినిమా ఎలా ఉంటుందో చెప్పండి.?

స) సికందర్ ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే అండర్ వరల్డ్ మూవీ. ఫ్రెండ్షిప్ మరియు లవ్ ఎమోషన్స్ కలిసి ఉన్న రివెంజ్ స్టొరీనే ఇది. ‘గజినీ’, ‘భాషా’ తరహాలో సాగే రివెంజ్ డ్రామా ఇది. రజినీకాంత్ కి ‘భాషా’, కమల్ హాసన్ కి ‘నాయకుడు’ ఎంత కీర్తి, గౌరవం తెచ్చిపెట్టాయో సూర్యకి ‘సికందర్’ అంతే కీర్తిని, గౌరవాన్ని తెచ్చి పెడుతుంది.

ప్రశ్న) సికందర్ లో సూర్య ఎలా ఉంటాడు.? అలాగే సూర్య డ్యూయల్ రోల్ గురించి చెప్పండి.?

స) సికందర్ అంటే ఎలాంటి భయం లేకుండా డేరింగ్ అండ్ డాషింగ్ గా ముందుకెళ్ళడం. ఇదే తరహాలోనే సూర్య పాత్ర ఉంటుంది. సూర్య చాలా స్టైలిష్ గా ఉండడమే కాకుండా తన పెర్ఫార్మన్స్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తాడు. ఇకపోతే అందరూ సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని అనుకుంటున్నారు. కానీ ‘గజినీ’లోలా ఒకే సూర్య ఉంటాడు, కానీ రెండు విభన్న పాత్రల్లో కనిపిస్తాడు. అది ఎలా అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్రశ్న) లింగుస్వామి గురించి, అలాగే సమంత రోల్ గురించి చెప్పండి.?

స) లింగుస్వామి తీసిన ప్రతి సినిమా డబ్బింగ్ రూపంలో లేదా రీమేక్ రూపంలో తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన పతి సినిమాలో ఒక మంచి పాయింట్ ని తీసుకొని దానికి యాక్షన్, ఎమోషన్స్ ని జత చేసి బాగా తీస్తారు. ఆయన తీసిన ఈ సినిమా కూడా అందరినీ మెప్పించేలా ఉంటుంది. తెలుగు సినిమా అంటే సమంత ఉండాలి అనేంతలా క్రేజ్ తెచ్చుకున్న సమంత ఇందులో చాలా గ్లామర్ గా కనిపించి ఆడియన్స్ ని ఆకట్టుకోనుంది.

ప్రశ్న) ‘సికందర్’ మేజర్ హైలైట్స్ ఏమిటి.?

స) సికందర్ సినిమాకి మేజర్ హైలైట్ అంటే అది సూర్య అనే చెప్పాలి. ఇకపోతే ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. మామూలుగా అందరూ ఇంటర్వల్ బాంగ్ బాగుందా క్లైమాక్స్ బాంగ్ బాగుందా అని అంటుంటారు. కానీ ఇందులో ఇంట్రడక్షన్, ఇంటర్వల్, క్లైమాక్స్ బాంగ్స్ అడిరిపోతాయి. అందుకే ‘బాంగ్ బాంగ్ బాంగ్’ అని ఉపశీర్షిక పెట్టాము.

ప్రశ్న) తెలుగు కథలతో హిట్స్ అందుకున్న మీరు ఇప్పుడెందుకు వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నారు.?

స) నా దగ్గర చాలా డైరెక్ట్ తెలుగు సినిమా కథలున్నాయి. కానీ ఆ కథలకి తగిన స్టార్స్ దొరకడం లేదు. నేను ఎంచుకునే కథలన్నీ కథాబలం ఉన్న సినిమాలే, నా గత సినిమాలన్నిటినీ ఎలాంటి స్టార్స్ లేకుండా తీశాను. నాకు, నా బ్యానర్ కి ఆ సినిమాలు మంచి పేరు తెచ్చాయి. కానీ కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం నష్టపోయారు. అందుకే హిట్స్ కావాలంటే కమర్షియల్ సినిమాలు కావాలి, అవి కావాలంటే స్టార్స్ కావాలి అందుకే నేను కాస్త ట్రాక్ మార్చి సినిమాలు చేస్తున్నాను. కానీ త్వరలో నా ఒరిజినల్ కథలని కూడా త్వరలోనే ప్రారంభిస్తాను.

ప్రశ్న) మీ తదుపరి సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ గురించి చెప్పండి.?

స) ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా ప్రస్తుతం చివరి దశలో ఉంది. దసరా – దీపావళి మధ్యలో ఈ సినిమాని రిలీజ్ చేస్తాం. టాలీవుడ్ లో ప్రేక్షకులు మెచ్చే ది బెస్ట్ లవ్ స్టొరీ అవుతుంది. ఈ సినిమా విషయంలో మహేష్ బాబు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది కాకుండా ‘పోటుగాడు’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాలని తమిళ్ లో రీమేక్ చేయాలని అనుకుంటున్నాం..

అంతటితో లగడపాటి శ్రీధర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు