“అనిమల్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

“అనిమల్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Apr 23, 2024 10:03 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన భారీ చిత్రమే “అనిమల్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకొని దర్శకుడు, హీరో ల కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళని సాధించి రికార్డు సెట్ చేసింది.

ఇక ఈ చిత్రానికి రెండో భాగం “అనిమల్ పార్క్” ని కూడా అనౌన్స్ చేయడంతో దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా దర్శకుడు సందీప్ వంగ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా 2026 లో మొదలవుతుంది అని అలాగే ఈ సినిమా మొదటి సినిమా కంటే చాలా వైల్డ్ గా ఉంటుంది అని కన్ఫర్మ్ చేసాడు.

దీనితో అనిమల్ 2 ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక మొదటి భాగంలో త్రిప్తి దిమ్రి, అనిల్ కపూర్, పృథ్వీరాజ్, బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా హర్ష వర్ధన్ రామేశ్వర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించాడు. అలాగే టి సిరీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు