కార్తీ “సర్దార్ 2” పై లేటెస్ట్ అప్డేట్.!

కార్తీ “సర్దార్ 2” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Apr 24, 2024 5:12 PM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా నటించిన పలు హిట్ చిత్రాల్లో సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా “సర్దార్” కూడా ఒకటి. దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం కార్తీ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలవగా దీనికి మేకర్స్ సీక్వెల్ కూడా ప్లాన్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం కూడా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సీక్వెల్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ముహుర్తాన్ని మేకర్స్ వచ్చే నెలలో అంటే మే లో కానుంది అని టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సామ్ సి ఎస్ సంగీతం అందించాడు అలాగే మేకర్స్ ఈసారి పార్ట్ ని మొదటి దాని కంటే భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు