‘ల‌క్కీ భాస్క‌ర్’ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్.. మెలోడితో మాయ చేశారుగా!

మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా, ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న మూవీ ‘ల‌క్కీ భాస్క‌ర్’. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యింది. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు జివి.ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తుండ‌టంతో ఇందులోని పాట‌లు ఆడియెన్స్ ను ఖ‌చ్చితంగా ఆక‌ట్టుకుంటాయ‌ని మేక‌ర్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. వారి న‌మ్మ‌కాన్ని నిజం చేస్తూ తొలి సాంగ్ ను మెలోడి ట్రాక్ గా కంపోజ్ చేశారు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. “శ్రీమ‌తిగారు..” అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటుంది. మంచి క్యాచీ ట్యూన్, అద్భుత‌మైన లిరిక్స్ తో వ‌చ్చిన ఈ పాట‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కుతోంది.

ఈ పాట‌కు శ్రీ‌మ‌ణి లిరిక్స్ అందించ‌గా.. విశాల్ మిశ్రా, శ్వేతా మోహ‌న్ ఈ పాట‌ను పాడారు. దుల్క‌ర్ సల్మాన్, మీనాక్షి చౌద‌రిల‌పై ఈ పాట‌ను చిత్రీక‌రించారు. ఇక ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య‌ల‌ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.