ఆకట్టుకునేలా “లవ్ మీ” నుంచి మహేష్ బాబు లాంచ్ చేసిన సాంగ్

ఆకట్టుకునేలా “లవ్ మీ” నుంచి మహేష్ బాబు లాంచ్ చేసిన సాంగ్

Published on May 22, 2024 12:57 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రానున్న ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో యంగ్ హీరో ఆశిష్ అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో దర్శకుడు అరుణ్ భీమవరపు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “లవ్ మీ” కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ గా వస్తున్నా ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొనగా తాజాగా మేకర్స్ సినిమా నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా సరికొత్త సాంగ్ ని అయితే లాంచ్ చేశారు.

ఏం అవుతుందో అంటూ సాగే ఈ సాంగ్ ని ఆస్కార్ కాంబినేషన్ ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా చంద్రబోస్ సాహిత్యంలో వచ్చింది. మరి దయ్యానికి ప్రేమికుడికి నడుమ సన్నివేశాలతో ఆకట్టుకునే విధంగా ఈ సాంగ్ ఉందని చెప్పాలి. అలాగే ఈ సాంగ్ కి నితీష్ కొండిపాటి అలాగే గోమతి అయ్యర్ ల వోకల్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇక ఈ వినూత్న హారర్ ప్రేమ కథా చిత్రం ఈ మే 25న రిలీజ్ కి రాబోతుండగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు