క్రేజీ: పవన్, తారక్ ల భారీ క్లాష్ పడబోతుందా!?

క్రేజీ: పవన్, తారక్ ల భారీ క్లాష్ పడబోతుందా!?

Published on May 19, 2024 3:11 PM IST


ఈ ఏడాదిలో మన టాలీవుడ్ సినిమా నుంచి పలు భారీ చిత్రాలే అది కూడా మన అగ్ర హీరోల నుంచే పడనున్నాయి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో వస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ “ఓజి” (They Call Him OG) కూడా ఒకటి కాగా దీనితో పాటుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా “దేవర” (Devara) కూడా ఒకటి.

అయితే ప్రస్తుతానికి అధికారికంగా లాక్ అయ్యిన రిలీజ్ డేట్స్ చూస్తే “ఓజి” సెప్టెంబర్ 27న రిలీజ్ కానుండగా “దేవర” అక్టోబర్ 10కి సిద్ధంగా ఉంది. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులు చూస్తుంటే దేవర కూడా సెప్టెంబర్ 27నే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ దేవర ప్రీపోన్ అంటూ రూమర్స్ ఉన్న సంగతి తెలిసిందే. వీటితో అయితే దేవర ఆగమనం సెప్టెంబర్ 27నే అని వినిపిస్తుంది.

అయితే ఓజి ఉండగా దేవర వచ్చే ఛాన్స్ కూడా తక్కువే అని చెప్పవచ్చు. ఎలాగో ఓజి అదే డేట్ లో వచ్చే ఛాన్స్ లు ఓటిటి డీల్ పై ఆధారపడి ఉంది అని అందుకే ఇది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారగా ఒకవేళ మారితే దేవర రావొచ్చేమో చూడాలి. లేదా రెండు ఒకే డేట్ లో వస్తాయేమో కాలమే నిర్ణయించాలి. ఒకవేళ కానీ ఒకే డేట్ లో రెండు సినిమాలు పడితే టాలీవుడ్ లో ఇది మరో భారీ క్లాష్ అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు