భారీ ధరకి అజిత్ సినిమా ఓటిటి హక్కులు.?

భారీ ధరకి అజిత్ సినిమా ఓటిటి హక్కులు.?

Published on May 22, 2024 8:00 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ హీరోగా చేస్తున్న చిత్రాల్లో తన ఫ్యాన్ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో చేస్తున్న అజిత్ మార్క్ ఎంటర్టైనర్ చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ” కూడా ఒకటి. మరి దీనిపై భారీ అంచనాలు నెలకొనగా మేకర్స్ కూడా ఎక్కువ గ్యాప్ లేకుండానే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందించేస్తునారు. దీనితో మరింత బజ్ ని అందుకుంటున్న ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ చిత్రంకి భారీ ఓటిటి డీల్ సెట్ అయినట్టుగా వినిపిస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా ఇందుకోసం ఏకంగా 95 కోట్లు ఆఫర్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు