ఈ మధ్య వచ్చిన దర్శకుల లో నూతన దర్శకుడు కిరణ్ మీగడ.ఇతను ఒక ఎన్.ఆర్.ఐ బహుళ జాతి కంపెనీ లో ఐ.టి నిపుణుడిగా చేసి సినిమా మీద ఉన్న ప్రేమతో చిత్ర దర్శకుడిగా వచ్చాడు. “మై హార్ట్ ఇస్ బీటింగ్” తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కిరణ్ తో జరిపిన ఇంటర్వ్యూ మీకోసం…
ప్రశ్న) మీ గురించి చెప్పండి
నేను పదిహేను సంవత్సరాలు ఐ.టి లో మేనేజర్ గా పని చేసాను. అమెరికా లో వచ్చిన సినిమాలకు కొన్నింటికి కో-డైరెక్టర్ గాను కొన్నింటి ప్రోడుక్షన్ సహాయకుడిగాను పని చేసాను అటువంటి చిత్రాలలో చెప్పుగోదగ్గవి “చింతకాయల రవి”,”స్వాగతం” మరియు “సంగమం” ఈ చిత్రాలు చేస్తున్న సమయం లో నేను కొంతమంది మంచి స్నేహితులను సంపాదించుకోగలిగాను
ప్రశ్న) మీ చిత్రం “మై హార్ట్ ఇస్ బీటింగ్” గురించి చెప్పండి
ఇద్దరి మధ్య జరిగే ప్రేమ కథ ఇది ఒకరినొకరు ప్రేమిస్తున్నా చెప్పలేని పర్స్తితులు వారివి ఇందులోనే ఎన్.ఆర్.ఐ ల జీవితం ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం మన రాష్ట్రం లో ప్రజలు ఈ చిత్రం తో బాగా కనెక్ట్ అవుతారు. అమెరికా లో ఉంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కుటుంబాలున్న ప్రతి ఒక్కరు చిత్రం లో లీనమవుతారు.
ప్రశ్న) ఈ చిత్రం లో ప్రత్యేకతలు ఏంటి?
పరిశ్రమ లో మొదటి సారిగా ఒకే చిత్రానికి ఇద్దరు దర్శకులు పని చేశారు. ఇంకొకరు అరుణ్ రుద్రా నేను కలిసి పని చేసాం ముందు ఈ చిత్రాన్ని తనే రాసుకున్నారు తరువాత నేను వచ్చాను ఈ చిత్రానికి మాటలు శివాజీ సోమయాజులు రచిస్తున్నారు ఈ చిత్రం లో ఇవి ఆకర్షిస్తాయి
ప్రశ్న) ఈ చిత్రం ఎలా మొదలయ్యింది?
ఎవరో అన్నట్టు ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరుగుతుంది సరయిన మనిషిని కలిస్నాపుడు సరయిన మనిషిని కలిసినపుడు జీవితం మారిపోతుంది అల ఒక స్నేహితుడ్డు ద్వారా అరుణ్ ని కలిసాను ఇద్దరు చిత్రాల గురించి మాట్లడుకోతం మొదలు పెట్టం ఇద్దరం ఆలోచిన్చేవిధానం ఒకేలా ఉందని అర్ధమయ్యింది తరువాత తన కథను నాకు వినిపించారు అక్కడ నుండి ఇద్దరం కలిసి పని చెయ్యాలని నిర్ణయించుకున్నాం
ప్రశ్న) ఇద్దరు దర్శకులు కలిసి పని చేస్తున్నపుడు చిత్రం చేయటం సులభమా?
ఆశ్చర్యకరంగా అవును అనే చెప్పాలి నిజానికి ఈ చిత్రాన్ని ఇద్దరం చేశాము ఎక్కడ గొడవలు కాలేదు ఒకరి ఆలోచనలను ఇంకొకరు గౌరవించుకున్నాం ఈ చిత్రాన్ని శరవేగంగా 42 రోజుల్లో చిత్రీకరించాం.
ప్రశ్న) ఇది మీ మొదటి చిత్రం అత ఎక్కడ అనుభవం లేహు అనిపించిందా?
ముందే చెప్పినట్టు నేను కొన్ని చిత్రాలకు కో-డైరెక్టర్ గాను మరికొన్ని చిత్రాలకు ప్రొడక్షన్ లో ను పని చేసాను అందులో అనుభవం నాకు బాగా ఉపయోగపడింది దర్శకులు దేవ్ కట్టా మరియు క్రిష్ లు నాకు ప్రేరణ వారు చేసే చిత్రాలను చూస్తుంటే చిత్రాలు చెయ్యాలని ఆశ ఇంకా పెరింగింది.
ప్రశ్న) తారలను ఎలా ఎంపిక చేసుకున్నారు?
మేము తెలుగు మాట్లాడగలిగిన నటుల కోసమే వెతికాము ఈ చిత్రం లో కనిపిన్చేవారందరు పని చేసేవారే చిత్ర పరిశ్రమ మీద ఆసక్తి తో ఈ చిత్రాన్ని చేశారు రేవంత్ మరియు రంజిత ప్రధాన జంట గా కనిపిస్తుండగా, రజినీకాంత్ మరియు సరయు రెండవ జంటగా నటించారు.
ప్రశ్న) వీరు నటులుగా పూర్తిగా కనిపించార?
లేదు. ఈ చిత్రం లో పరిధి మేరకు బానే నటించారు. రేవంత ద్బుతంగా డాన్స్ చెయ్యగలడు. అశ్విన్ రెడ్డి తన హాస్యంతో అందరిని నవ్విస్తాడు.శ్రిని కొల్ల తన నటనతో అందరిని ఆశ్చర్య పరుస్తాడు.
ప్రశ్న) చిత్ర ఆడియోకి వచ్చిన స్పందన గురించి చెప్పండి?
మైకేల్ మక్కల్ ఇచ్చిన సంగీతం అందరిని ఆకట్టుకుంది చాలా మంచి స్పందన వచ్చింది మేము చిత్ర సంగీతానికి సాహిత్యం తోదవాలనే అనుకున్న అదే జరిగింది ఈ చిత్రం లో చిత్ర గారు పాడటం అదే మాకొక విజయంలా కనిపిస్తుంది.
ప్రశ్న) కొత్త దర్శకుడు కదా నిర్మాత ఎలా దొరికారు?
టెక్నాలజీ మరియు నేత్వోర్కింగ్ ఈ విషయం లో ప్రధాన పాత్ర పోషించింది. నన్ను నిర్మాత రాజశేఖర్ కి పరిచయం చేసింది ఆయన ముందు నుండి ఈ చిత్రం మీద చాల నమ్మకం ఉంచారు. ఎక్కడ సర్దుకుపోకుండా చిత్రాన్ని నిర్మించారు ఇప్పుడు ప్రచారం కూడా అద్బుతంగా నిర్వహిస్తున్నారు ఇటువంటి నిర్మాత దొరకడం మా అదృష్టం.
ప్రశ్న) ఏదయినా సందేశం చెప్పాలనుకుంటున్నారా?
ఈ చిత్రం కోసం నాకు మరియు రుద్రకి సహకరించిన అందరికి నా కృతజ్ఞతలు. కపిలేశ్వర్ పున్నా మరియు రవి కొత్తపల్లి ఈ చిత్రానికి సహాయకులుగా పని చేశారు. ఈ చిత్రం తెలుగు ప్రజలకు నచ్చుతుంది మా ” మై హార్ట్ ఇస్ బీటింగ్” చిత్రాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను,.
దీనితో ఇంటర్వ్యూ పూర్తయ్యింది చిత్రం విజయం సాదించి కిరణ్ మంచి దశకుడు కావాలని మనం కోరుకుందాం. పేస్ బుక్ లో కిరణ్ ని ఇక్కడ ఫాలో అవ్వండి http://www.facebook.com/meegada
అనువాదం : రv