కరోనా ఎఫెక్ట్, కమల్ సినిమాకు మరిన్ని కష్టాలు..!

కరోనా ఎఫెక్ట్, కమల్ సినిమాకు మరిన్ని కష్టాలు..!

Published on Apr 5, 2020 8:21 PM IST

కమల్ హాసన్-శంకర్ భారతీయుడు2 సినిమా ఏ సమయంలో మొదలుపెట్టారో కానీ వరుస సమస్యలతో సతమతం అవుతుంది. ఈ మూవీ షూటింగ్ మొదలైన కొన్నాళ్లకే నిర్మాతలకు, దర్శకుడుకి మధ్య విభేదాలు తలెత్తాయి. కమల్ జోక్యంతో ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరి మళ్ళీ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. నిర్మాత ఆర్ధిక ఇబ్బందుల కారణంగా మరికొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇవి చాలవన్నట్టు కమల్ కాలికి చిన్న గాయం కావడంతో మరికొన్ని రోజులు సినిమా ఆగిపోయింది.

ఇక నెల క్రితం సెట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకొని ఇద్దరు యువకులు అక్కడిక్కడే చనిపోగా, ఒకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఇది భారతీయుడు2 చిత్ర యూనిట్ పై తీవ్ర ప్రభావం చూపింది. దర్శకుడు శంకర్ కి కూడా ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. ఇక షూటింగ్ చివరి దశకు చేరింది అనుకుంటున్న తరుణంలో కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. దీనితో నిర్మాతలకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. అసలు ఈ మూవీ పూర్తి చేయాలా వద్దా అనే సందిగ్ధంలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, సిద్దార్ధ్ కీలక రోల్ చేస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు