రష్మికకు మోడీ రిప్లై వైరల్.!

రష్మికకు మోడీ రిప్లై వైరల్.!

Published on May 17, 2024 9:56 AM IST


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర సత్తా మంచి వరుస భారీ ఆఫర్స్ అందుకుంటున్న స్టార్ హీరోయిన్స్ లో యంగ్ నటి రష్మికా మందన్నా కూడా ఒకరు. మరి ఇప్పుడు రష్మిక హీరోయిన్ గా “పుష్ప 2” (Pushpa 2) సహా బాలీవుడ్ లో “సికిందర్” (Sikandar) తదితర భారీ చిత్రాలు అనేక భాషల్లో చేస్తుండగా తాను మై ఇండియా అంటూ చేసిన పోస్ట్ రీసెంట్ గా మంచి వైరల్ అయ్యింది. అయితే దీనికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రిప్లై ఇవ్వడం గమనార్హం.

సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా వరకు అందరి హృదయాలు కలుపుకుంటూ వెళ్ళాలి అంటూ రష్మిక నుంచి ఓ వీడియో పోస్ట్ రాగా దీనికి నరేంద్ర మోడీ నుంచి రిప్లై రావడం ఒక ఊహించని అంశంగా మారింది. మోడీ రిప్లై ఇస్తూ “ఖచ్చితంగా! మనుషుల్ని కలుపుకుంటూ వెళుతూ వారి జీవితాల్ని మెరుగు పరచడం కంటే ఏది సంతృప్తి ఇవ్వదు” అంటూ తెలిపారు. దీనితో ఈ పోస్ట్ కి 12 గంటల్లోపే 90 వేలకి పైగా లైక్స్ వచ్చేయడం విశేషం. దీనితో ఈ పోస్ట్ లు అయితే ఇపుడు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు