ఇంటర్వ్యూ : నరేష్ – సినిమాలో నాకు ‘బీరువా’ను చూస్తే టెన్షన్..

ఇంటర్వ్యూ : నరేష్ – సినిమాలో నాకు ‘బీరువా’ను చూస్తే టెన్షన్..

Published on Jan 20, 2015 9:08 PM IST

Naresh
2014 సంవత్సరంలో ‘చందమామ కథలు’, ‘పరంపర’, ‘దృశ్యం’, ‘చిన్నదాన నీకోసం’ మరియు ఇతర సినిమాలలో నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పేరు తెచ్చుకున్నారు నరేష్. మంగళవారం ఈ నటుడి పుట్టినరోజు సందర్భంగా పాత్రికేయులతో సమావేశం అయ్యారు. 2015లో ‘బీరువా’తో మొదలుకుని విజయ పరంపర కొనసాగిస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సందీప్ కిషన్, సురభి జంటగా కన్మణి దర్శకత్వంలో నటించిన ‘బీరువా’లో నరేష్ ముఖ్య పాత్రలో నటించారు. ‘బీరువా’ సినిమా గురించి, సినీ కెరీర్ గురించి ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘బీరువా’ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?

స) హీరో సందీప్ కిషన్ కు తండ్రిగా ‘బీరువా’ సినిమాలో నటించాను. నాకు ‘బీరువా’ను చూస్తే టెన్షన్.. ఒక్కోసారి సంతోషం. అలా ఎందుకో జరుగుతుందో మీరు సినిమా చూస్తే అర్ధమవుతుంది. దర్శకుడు కన్మణి సినిమాను అద్బుతంగా తెరకెక్కించాడు. కంప్లీట్ సినిమాలో నాకు ఓ కొత్తదనం కనిపించింది. ఈ సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ నాకు లభించింది. ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) యువ హీరో సందీప్ కిషన్ ఎలా నటించాడు..?

స) సినిమా అంతా సందీప్ మరియు నా క్యారెక్టర్ మధ్య నడుస్తుంది. వినోదభరిత సినిమా ఇది. ఏ నటుడికైనా కామెడీ టైమింగ్ చాలా ముఖ్యం. సందీప్ కి మంచి టైమింగ్ ఉంది. మా ఇద్దరి మధ్య కామెడీ టైమింగ్ కుదరడం వలన సన్నివేశాలు బాగా వచ్చాయి.

ప్రశ్న) రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి ‘బీరువా’ను నిర్మించాయి. ఈ సినిమాలో నటించడం పట్ల మీ స్పందన..?

స) సూపర్ హిట్ ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాతో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయ్యింది. ఆ సినిమాలో నేనే హీరో. తర్వాత ‘మనసు మమత’ వంటి విజయవంతమైన సినిమాలలో నటించాను. నా సొంత నిర్మాణ సంస్థలా భావిస్తాను. సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్లీ ఉషా కిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ వంటి గొప్ప సంస్థలు కలిసి నిర్మించిన సినిమాలో నేను నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్ పరుగులు పెడుతుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) ఈ ఏడాది పుట్టినరోజు ఎలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు..?

స) సమాజసేవలో అడుగు పెట్టిన తర్వాత జిల్లాలో ప్రజాసేవ చేయడం మొదలుపెట్టాను. నేను స్థాపించిన ‘కళాకారుల ఐక్య వేదిక’ సభ్యులతో కలిసి సామజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాను. పుట్టినరోజును పెద్దగా సెలెబ్రేట్ చేసుకునే అలవాటు క్రమంగా తగ్గిపోయింది.

ప్రశ్న) మీ తదుపరి సినిమా విశేషాలు ఏంటి..?

స) ‘బీరువా’ తర్వాత ‘గడ్డం గ్యాంగ్’, ‘పానిపురి’ అనే సినిమాలలో నటిస్తున్నాను. వీటిలో కూడా మంచి క్యారెక్టర్లు లభించాయి. దిల్ రాజు – హరీష్ శంకర్ సినిమా, మరో మూడు తమిళ సినిమాలు అంగీకరించాను. ఈ ఏడాది కమర్షియల్ సక్సెస్ తో పాటు అవార్డులు లభిస్తాయని ఆశిస్తున్నాను. ఈ ఏడాది డిఫరెంట్ గెటప్ లలో కనిపిస్తాను. దాని కోసం కాస్త బరువు తగ్గాను. 2014 నుండి తమిళంలో నటిస్తున్నాను. అవి ఈ ఏడాది విడుదలవుతున్నాను.

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు