స‌స్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ గా ‘లెవన్’ టీజ‌ర్


త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు న‌వీన్ చంద్ర‌. హీరోగా, విల‌న్ గా ఆడియెన్స్ ను త‌న ప‌ర్ఫార్మెన్స్ తో న‌వీన్ చంద్ర ఫిదా చేశారు. ఇక న‌వీన్ చంద్ర ప్ర‌స్తుతం ‘లెవ‌న్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రాబోతున్న సినిమాలో న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను రిలీజ్ చేశారు.

వ‌రుస హత్య‌లు చేస్తున్న హంత‌కుడిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌వీన్ చంద్ర న‌టిస్తున్నారు. ఈ హ‌త్య‌ల వెనుక ఉన్న వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌యాన్ని న‌వీన్ చంద్ర ట్రేస్ చేసే విధానం మ‌న‌కు ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు. ఇక ఈ టీజ‌ర్ లోని ప‌లు సీన్స్ ప్రేక్ష‌కుల‌ను స్ట‌న్ చేసేలా ఉన్నాయి.

లోకేశ్ అజిల్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ మూవీకి డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రెయా హ‌రి, శ‌శాంక్, అభిరామి, దిలీప‌న్, రిత్విక‌, రవి వ‌ర్మ‌, కిరీటి దామ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి