ఎన్టీఆర్ గెటప్స్ పై కొత్త అప్ డేట్ !

ఎన్టీఆర్ గెటప్స్ పై కొత్త అప్ డేట్ !

Published on Nov 29, 2020 9:03 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’లో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి మళ్ళీ ఫిల్మ్ సర్కిల్స్ లో కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం ఏడు గెటప్స్ లో కనిపిస్తాడని.. మొదటిది ట్రైబ్ గెటప్ కాగా, రెండోది అప్పటి రోజుల్లోని విప్లవకారుడి గెటప్ అని.. ఇక మిగిలిన ఐదు గెటప్స్ వివిధ సందర్భాల్లో తారక్ శత్రువుల నుండి తప్పించుకుపోవడానికి తరుచూ గెటప్స్ మారుస్తూ ఉంటాడని తెలుస్తోంది.

ఇక సినిమాలో తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు కూడా చాలా గొప్పగా ఉంటాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు.

మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు