‘ఎన్టీఆర్ 31’లో ఆ హీరోయిన్ ?

‘ఎన్టీఆర్ 31’లో ఆ హీరోయిన్ ?

Published on May 22, 2024 3:00 AM IST

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఈ ఏడాది ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ పవర్‌ హౌస్ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంటూ ఈ చిత్రబృందం నిన్న ఓ మెసేజ్ ను కూడా పోస్ట్ చేసింది. ఐతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోందని తెలుస్తోంది. మరి, కియారా అద్వానీ, నిజంగానే ఎన్టీఆర్ సరసన నటిస్తే.. ఆ క్రేజే వేరు.

అలాగే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని.. ఆ పాత్రలో మరో స్టార్ హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో చూడాలి. మొత్తానికి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా కథ పై, తారక్ సరసన నటించే హీరోయిన్ పై చాలా రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్ డేట్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు