నాలుగు గెటప్స్ లో కనిపించనున్న ‘కంగ‌నా’ ?

నాలుగు గెటప్స్ లో కనిపించనున్న ‘కంగ‌నా’ ?

Published on Apr 7, 2020 6:59 AM IST

తమిళ డైరెక్టర్ ఎ.ఎల్‌.విజ‌య్ దర్శకత్వంలో దివంగత నేత జయలలిత బయోపిక్ గా రాబోతున్న చిత్రం ‘తలైవి’. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించబోతుంది.

కాగా ఈ సినిమా బడ్జెట్ దాదాపు వంద కోట్లు అని తెలుస్తోంది. ఎలాగూ కంగనాకి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఇక ఈ చిత్రం హిందీ మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పైగా అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ బయోపిక్ పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లు పెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని నిర్మాతలు ఫీల్ అవుతున్నారు. కాగా ఈ చిత్రం కోసం తమిళం కూడా నేర్చుకుంటున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. మరి ఏ రేంజ్ లో కలెక్షన్స్ కురిపిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు