నా సినిమాకి బ్యానర్ కట్టడం కూడా వేస్ట్ అన్నారు – విజయ్ సేతుపతి కామెంట్స్

కోలీవుడ్ వెర్సటైల్ నటుడు, హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మహారాజ’ తో తన కెరీర్ లో హీరోగా బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది విజయ్ సేతుపతిని సపోర్టింగ్ పాత్రల్లోనే చూసేందుకు ఇష్టపడ్డారు కానీ హీరోగా మాత్రం తన సినిమాలకి ఒకింత తక్కువ ఆదరణే ఉంటుంది అని తెలిసిందే.

కానీ దానిని మించాలనే హీరోగా కూడా నిలదొక్కుకోవాలి అని మక్కల్ సెల్వన్ తన 50వ సినిమాతో అందరికీ సమాధానం ఇచ్చాడు. అయితే తెలుగు సహా తమిళ్ లో భారీ విజయాన్ని ఈ సినిమా సొంతం చేసుకోగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని మన దగ్గర తమిళ నాట కూడా విజయ్ సేతుపతి చేస్తున్నాడు.

అయితే లేటెస్ట్ గా తమిళ నాట జరిగిన ప్రెస్ మీట్ లో తన కామెంట్ ఒకటి వైరల్ గా మారింది. ‘రీసెంట్ టైం లో నా నుంచి వచ్చిన ఓ సినిమా రిలీజ్ కి ఒకరు అసలు నా సినిమాకి బ్యానర్ కట్టడం కూడా వేస్ట్ నా సినిమాలకి జనం ఎవరూ రారు అన్నారు’ అని సేతుపతి ఇప్పుడు తన మహారాజ కి ప్రేక్షకులు ఇచ్చిన భారీ విజయాన్ని ఉద్దేశించి కౌంటర్ చేశారు. దీనితో ఈ స్టేట్మెంట్ వైరల్ గా మారింది.