“కల్కి” పై ఆ వార్తలు అవాస్తవం?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ కి ఇప్పుడు సమయం దగ్గర పడుతుంది. ఇక ఈ భారీ సినిమాలో కమల్, అమితాబ్ లాంటి వారు కూడా నటిస్తుండగా ప్రస్తుతం ప్రమోషన్స్ మాత్రం అరకొరగానే జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దిగ్గజ నిర్మాత అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమరావతి లో ప్లాన్ చేసినట్టుగా టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ ఆపేసారని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రభాస్ కూడా ఈవెంట్ వద్దు అనుకుంటున్నాడని కొత్త వెర్షన్ లు పుట్టించారు.

అయితే ఇవి అవాస్తవం అని తెలుస్తోంది. అమరావతిలో ప్లాన్ చేసుకున్న డేట్ కి వాతావరణం బాగోకపోవచ్చు అనేది ఒక కారణం అయితే ఒకవేళ అక్కడ జరగకుండా ఉంటే మళ్లీ హైదరాబాద్ లోనే జరిగే అవకాశం ఉందని వినిపిస్తోంది. అంతేకాని ప్రీ రిలీజ్ ఆగలేదనే తెలుస్తోంది.