మహేష్ గొప్ప మనసు.. తన అభిమాని కుటుంబాన్ని దత్తత

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఒక్క ఆన్ స్క్రీన్ మీదనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా రియల్ హీరో అని అందరికీ తెలిసిందే. తన కష్టార్జితం నుంచి చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్ కోసం వెచ్చించి ఇప్పటి వరకు ఎన్నో వేల ప్రాణాలని కాపాడి అంతమంది కుటుంబాలకి కనిపించే దైవం అయ్యాడు. అయితే అయితే తనకి ఉన్న కోట్ల అభిమానుల్లో ఒక అభిమాని తాలూకా విషాద గాథ ఇప్పుడు అందరినీ ఎంతగానో కదిలిస్తుంది.

బాపట్ల కాకర్లమూడికి చెందిన మహేష్ బాబు అలాగే స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారికి వీరాభిమాని అయినటువంటి రాజేష్ అనే వ్యక్తి గత కొంత కాలం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలకి గురి కావడంతో తమ మీద ఆధారపడిన కుటుంబం ఒక్కసారిగా నిస్సహాయత స్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే ఇంకా చిన్న వయసులోనే ఉన్న ముగ్గురు కొడుకులు తనకి ఉండగా వారికి మహేష్ బాబు మీద ఉన్న అభిమానంతో అర్జున్, అతిధి, ఆగడు అంటూ మహేష్ సినిమాల పేర్లనే తాను పెట్టుకున్నాడు.

వీరిలో పెద్దవాడు అర్జున్ ఏదో చిన్న పని చేస్తూ ఖర్చులకి సంపాదిస్తున్నాడు అట కానీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు. మరి ఈ విషయం ఎలాగో మహేష్ బాబు దృష్టికి రావడంతో ఆ ముగ్గురు పిల్లలని దత్తత తీసుకోనున్నారని తెలుస్తుంది. వారికి కావాల్సిన సదుపాయాలు అన్నీ ఇక మహేష్ బాబే చూసుకోనున్నారు. మరి ఇప్పటికే ఎన్నో మంచి పనులు చేసి అభిమానుల కళ్ళలో దేవుడిగా మారిన మహేష్ బాబు ఈ చర్యతో తన అభిమానుల్లో మరోసారి మరింత స్థాయిలోకి వెళ్లారు.