పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసిన వివాదాస్పద హీరోయిన్

పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసిన వివాదాస్పద హీరోయిన్

Published on Oct 26, 2020 11:27 PM IST

బాలీవుడ్ పరిశ్రమలో ఈమధ్య చెలరేగిన పలు వివాదాల్లో పాయల్ ఘోష్ వివాదం కూడ ఒకటి. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తమ మీద లైంగిక దాడి చేశాడని, అతని అరెస్ట్ చేయాలని పాయల్ ఘోష్ పెద్ద దుమారమే రేపింది. పోలీస్ ఫిర్యాదులతో పాటు పలువురు రాజకీయ నాయకులను కూడ కలిసి తనకు మద్దతివ్వాలని కోరింది. ఉన్నట్టుండి బయటికొచ్చి డైరెక్టర్ మీద పెద్ద ఆరోపణలే చేసిన పాయల్ వ్యవహారశైలి బాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ వివాదం అలా నడుస్తూ ఉండగానే పాయల్ ఘోష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసింది. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) లో చేరింది. పార్టీ చీఫ్ రామ్‌దాస్ అథవాలే స్వయంగా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు ఆమెకు పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలి పదవిని కూడ ఇచ్చేశారు. పాయల్ ఇలా ఒక్క రోజు వ్యవధిలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, పదవి పొందడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాయల్ ఘోష్ గతంలో ‘ప్రయాణం, ఊసరవెల్లి’ చిత్రాల్లో నటించిన ఆ తరవాత బాలీవుడ్ పరిశ్రమకు వెళ్ళిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు