ఆ నిర్మాతల వేధింపుల పై పాయల్ స్పందన

ఆ నిర్మాతల వేధింపుల పై పాయల్ స్పందన

Published on May 20, 2024 1:13 PM IST

‘ఆర్‌ఎక్స్ 100’ ఘనవిజయం తర్వాత పాయల్ రాజ్‌పుత్‌ కి ఎంతో పేరు తెచ్చిపెట్టిన చిత్రం మంగళవారం. ఐతే, పాయల్ రాజ్ పుత్ గతంలో రక్షణ అనే ఓ సినిమా చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా వివాదం అయ్యింది. ఈ సినిమా విషయంలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా పాయల్ రివీల్ చేసింది. అసలేం జరిగింది అంటే.. ఈ సినిమాకు సంబంధించి పాయల్ రాజ్ పుత్ కు ఇంకా కొంత పేమెంట్ పెండింగ్ లో ఉంది. ఐతే, ఆ డబ్బు ఇవ్వకుండానే, తనను ప్రచారానికి రమ్మని బలవంతం చేస్తున్నారని పాయల్ రాజ్ పుత్ తెలిపింది.

కాగా ప్రస్తుతం తన కాల్షీట్లు అందుబాటులో లేవని పాయల్ రాజ్‌పుత్‌ చెప్పడంతో.. ఆ చిత్ర నిర్మాతలు ఆమెను అసభ్య పదజాలంతో దూషించారట. బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తే డిజిటల్ ప్రమోషన్ చేయడానికి సిద్ధమని పాయల్ చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదని పాయల్ చెబుతుంది. పైగా టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామంటూ పాయల్ రాజ్‌పుత్‌ ను వారు బెదిరిస్తున్నారట. మరి ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని పాయల్ కోరుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు