ఫోటో మూమెంట్: ఉప ముఖ్యమంత్రిగా సంతకం చేస్తున్న పవన్ కళ్యాణ్

టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాకుండా ఇప్పుడు బయట కూడా నిజమైన పవర్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ట్యాగ్ కి న్యాయం చేసారని చెప్పాలి. ఇప్పుడు హీరోగానే కాకుండా ఉప ముఖ్యమంత్రి హోదా సొంతం చేసుకున్నారు.

అయితే పవన్ నిన్ననే తన ప్రమాణ స్వీకారం తర్వాత బయటకి రాగా నేడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి హోదాకి సంతకాన్ని చేసి ఆ శాఖ తాలూకా భాద్యతలు అధికారికంగా మొదలు పెట్టారు. మరి పవన్ సంతకం చేస్తున్న ఈ స్పెషల్ మూమెంట్ వైరల్ గా మారింది. దీన్ని ఫోటో రూపంగా తన టీం నుంచి బయటకి వదిలారు.

ఇందులో అప్పటికే పూలతో ఘన స్వాగతం అందుకున్న పవన్ సంతకం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. దీనితో అభిమానులు ఈ పిక్ చూసి మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ ప్రస్తుతం ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి ఇంకా మళ్ళీ షూటింగ్ రీస్టార్ట్ చేసుకోవాల్సి ఉంది.