“కల్కి” సెన్సార్ రిపోర్ట్ అవుట్.!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సై ఫై, ఫాంటసీ డ్రామా “కల్కి 2898 ఎడి” కోసం తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ వేడుకలు ప్లానింగ్ లో ఉన్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకి వచ్చింది. దీని ప్రకారం అయితే సెన్సార్ యూనిట్ వారు కల్కి సినిమా చూసి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారట. సినిమా ఏమాత్రం తగ్గకుండా ఉందని, గ్రాండ్ విజువల్స్ కానీ ఎమోషన్స్ కానీ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ని కానీ నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేస్తూ తెరకెక్కించి మంచి ట్రీట్ ని డెలివర్ చేసినట్టుగా తెలుస్తుంది.

అంతే కాకుండా భైరవగా ప్రభాస్ తన రోల్ లో అదరగొట్టాడని అంతే కాకుండా తన లోని కామెడీ టైమింగ్ కూడా మంచి ట్రీట్ ఇస్తుంది అని తెలుస్తుంది. మొత్తానికి అయితే సెన్సార్ యూనిట్ నుంచి కల్కి చిత్రానికి సాలిడ్ రిపోర్ట్స్ వచ్చేసాయి. ఇక వచ్చే వారం సినిమా వచ్చాక మ్యానియా ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.