నెగిటివ్ రోల్ లో కనిపించనున్న ప్రిన్స్ ?

నెగిటివ్ రోల్ లో కనిపించనున్న ప్రిన్స్ ?

Published on Oct 26, 2020 7:22 PM IST


సంపత్‌ నంది డైరెక్షన్ లో గోపీచంద్‌ చేస్తోన్న తాజా సినిమా ‘సిటీమార్’. ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో యంగ్ హీరో ప్రిన్స్ ను కూడా తీసుకున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రిన్స్ రఫ్ లుక్ లో ఈ సినిమాలో కనిపిస్తాడని.. సెకెండ్ హాఫ్ లో ప్రిన్స్ క్యారెక్టర్ సినిమాలో ఎంటర్ అవుతుందని తెలుస్తోంది. ఇక మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారట.

ఆ పాత్రలో కృష్ణ భగవాన్ నటిస్తున్నాడట. చాల కాలం తరువాత కృష్ణ భగవాన్ కి మంచి కామెడీ క్యారెక్టర్ దొరికింది. అన్నట్టు ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటుందట. ఇక ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే కసితో బాగా పట్టుదలగా ఉన్నాడు సంపత్ నంది. మరి ఈ సారి ఈ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు