సెన్సార్ పూర్తి చేసుకున్న “రాజు యాదవ్”

సెన్సార్ పూర్తి చేసుకున్న “రాజు యాదవ్”

Published on May 21, 2024 1:00 AM IST

పలు చిత్రాలతో మంచి నటుడుగా, కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, టీవీ ఆర్టిస్ట్ గెటప్ శ్రీను తదుపరి రాజు యాదవ్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం లో లీడ్ లో నటిస్తున్నారు. మే 24, 2024న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నూతన దర్శకుడు కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుండి యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. అంకితా ఖరత్ మహిళా కథానాయికగా నటిస్తుండగా, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై కె. ప్రశాంత్‌రెడ్డి, రాజేష్ కల్లేపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు