మరింత కిక్ ఇచ్చేలా “డబుల్ ఇస్మార్ట్” టీజర్ మేకింగ్

మరింత కిక్ ఇచ్చేలా “డబుల్ ఇస్మార్ట్” టీజర్ మేకింగ్

Published on May 22, 2024 3:03 PM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కావ్య థఫర్ (Kavya Thapar) హీరోయిన్ గా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannath) కాంబినేషన్ లో చేస్తున్న “డబుల్ ఇస్మార్ట్” కోసం తెలిసిందే. రామ్ అభిమానులు సహా మాస్ ఆడియెన్స్ లో మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే క్రేజీ టీజర్ కట్ కూడా వచ్చింది.

అయితే దీనికి సాలిడ్ రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఈ టీజర్ ట్రీట్ కి అదనపు ట్రీట్ జోడిస్తూ ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి ఇది అయితే టీజర్ లో కనిపించిన ఇంట్రెస్టింగ్ షాట్స్ తాలూకా మేకింగ్ తో కనిపిస్తుంది. అలాగే మరిన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి.

సంజయ్ దత్ (Sanjay Dutt) హెయిర్ స్టైల్ నుంచి రామ్ పోతినేని, ఆలీ ల సీన్స్ వరకు చాలానే అంశాలు కనిపిస్తున్నాయి. అలాగే డబ్బింగ్ చెబుతున్నపుడు రామ్ లుక్ కూడా ఉబర్ స్టైలిష్ గా గమనించవచ్చు. ఇంకా రామ్ కి సీన్ టు సీన్ తన బాడీ లాంగ్వేజ్ ని పూరి తన మార్క్ డైరెక్షన్ తో చేసి చూపించడం వంటివి కూడా ఈ మేకింగ్ వీడియోలో మంచి హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా పూరి జగన్నాథ్, ఛార్మిలు నిర్మాణం వహిస్తున్నారు.

మేకింగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు