హిందీ భీష్మలో హీరో ఆ స్టార్ హీరోనే ?

హిందీ భీష్మలో హీరో ఆ స్టార్ హీరోనే ?

Published on Jun 7, 2020 1:30 AM IST

‘అర్జున్ రెడ్డి’ రీమేక్ హిందీలో కూడా భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100′, ఓ బేబీ’ చిత్రాల రైట్స్ ను ఇప్పటికే బాలీవుడ్ నిర్మాతలు కొనేశారు. అలాగే భీష్మ చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు… బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే రణబీర్ కపూర్ ఇప్పటికే వరుస సినిమాలకు కమిట్ అవ్వడంతో ఈ రీమేక్ ఉండకపోవచ్చు అని అనుకున్నారు. కానీ ఈ రీమేక్ చేయటానికి రణబీర్ కపూర్ ఇంట్రస్ట్ గా ఉన్నారట. పైగా భీష్మ స్క్రిప్ట్ రణబీర్ కపూర్ కి బాగుంటుందనే ఫీల్ రావడంతో కరుణ్ జోహార్, రణబీర్ కపూర్ నే హీరోగా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట.

భీష్మ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమాకు ఓవర్శిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాల్లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఈ సినిమా రెట్టింపు లాభాలను సొంతం చేసుకుంది. మొత్తానికి, హీరో నితిన్ కి కూడా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమా రణబీర్ కపూర్ కి కూడా సూపర్ హిట్ ని ఇస్తుందా..? అలాగే నితిన్ చేసిన పాత్రలో రణబీర్ కపూర్ ఎలా నటిస్తాడో చూడాలి. అన్నట్లు ఈ మధ్య ఇక్కడ సూపర్ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు