లవ్ స్టోరీ లో ఆమెదే డామినేషన్..?

లవ్ స్టోరీ లో ఆమెదే డామినేషన్..?

Published on Apr 5, 2020 10:15 PM IST


2017లో శేఖర్ కమ్ముల ఫిదాతో తన మ్యాజిక్ రిపీట్ చేశాడు. చాల కాలం తరువాత తన స్థాయి హిట్ అందుకున్నాడు. హీరోయిన్ గా చేసిన సాయి పల్లవి తెలుగు వారికి ఈ చిత్రం బాగా దగ్గర చేసింది. అట్టిట్యూడ్, సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన తెలంగాణా అమ్మాయిగా ఆమె నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. పాత్ర పరంగా కూడా హీరో వరుణ్ ని కూడా డామినేట్ చేసేలా ఉంటుంది. హీరోయిన్స్ చేత హీరోలను డామినేట్ చేయించడం శేఖర్ కమ్ములకు అలవాటే. ఆయన ఫస్ట్ మూవీ ఆనంద్ దగ్గర నుండి, హీరోయిన్స్ వెంటపడేలా హీరో పాత్రలు ఉంటాయి.

మరి ఆయన లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ లో చైతు, సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీ, రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తి రేపుతోంది. ఈ మూవీలో కూడా చైతూ పై సాయిపల్లవిదే పై చేయి అని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ ప్రోమో వీడియోలో మెట్రో ట్రైన్ లో చైతూ కి ముద్దుపెట్టేస్తుంది, సాయి పల్లవి. ఇవ్వన్నీ గమనిస్తుంటే ఫిదా వలె లవ్ స్టోరీ లో కూడా సాయి పల్లవిదే డామినేషన్ అనిపిస్తుంది. చైతూ ఈ చిత్రంలో డిప్రెషన్ లో ఉంటే మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. నారాయణ్ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తుండగా, పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు