సైలెంట్ గా హిందీ ఓటిటిలోకి వ‌చ్చేస్తున్న ‘సైంధ‌వ్’

స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ త‌న కెరీర్ లోని 75వ చిత్రంగా తెర‌కెక్కించిన ‘సైంధ‌వ్’ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను ‘హిట్’ సినిమా ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను డైరెక్ట్ చేయ‌డంతో మూవీపై మంచి అంచ‌నాలు ఏర్పాడ్డాయి. అయితే, ‘సైంధ‌వ్’ మూవీ అనుకున్న స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఉత్తరాది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు సిద్ధ‌మైంది. ఈ చిత్రాన్ని హిందీలో ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్స్ క‌ల‌ర్స్ సినీ ప్లెక్స్, జియో సినిమా లో స్ట్రీమింగ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు. ఈ మేర‌కు అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ కూడా చేశారు.

‘సైంధ‌వ్’ చిత్రాన్ని జూన్ 23న రాత్రి 8 గంట‌ల‌కు వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్ గా స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో వెంకీ యాక్ష‌న్ తో ఇర‌గదీశాడు. దీంతో ఈ సినిమా నార్త్ ఆడియెన్స్ కు న‌చ్చుతుందని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్ర‌ద్ధా శ్రీనాథ్, రుహానీ శ‌ర్మ‌, ఆండ్రియా జెరిమియా, న‌వాజుద్దిన్ సిద్ధిఖి తదిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.