‘సికంద‌ర్’ షూటింగ్ మొద‌లుపెట్టిన మురుగ‌దాస్

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ త‌న కొత్త సినిమాను ప్రారంభించారు. త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఆర్.మురుగ‌దాస్ డైరెక్ష‌న్ లో ‘సికంద‌ర్’ అనే సినిమాలో న‌టిస్తున్న‌ట్లు గ‌తంలోనే స‌ల్మాన్ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మేక‌ర్స్ స్టార్ట్ చేశారు.

తొలిరోజు షూటింగ్ లో స‌ల్మాన్ పాల్గొన్న‌ట్లుగా ద‌ర్శ‌కుడు ఏఆర్.మురుగ‌దాస్ తెలిపారు. ఈమేర‌కు ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. “స‌ల్మాన్ ఖాన్ గారితో వ‌ర్క్ చేయ‌డం సంతోషంగా ఉంది…” అంటూ త‌న ఆనందాన్ని తెలియ‌జేశారు.

ఇక ఈ సినిమాను పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ద‌ర్శ‌కుడు ఏఆర్.మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాను సాజిద్ న‌డియాడ్వాలా ప్రొడ్యూస్ చేస్తుండ‌గా, 2025 ఈద్ కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.