ఇండియన్ సినిమా దగ్గర అపారమైన ఆదరణ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒకరు. మరి రజినీకాంత్ హీరోగా ఇపుడు సాలిడ్ ప్రాజెక్ట్ లు కొన్ని చేస్తుండగా తనపై లేటెస్ట్ గా బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు మన ఇండియన్ ఆడియెన్స్ కి మొదటి సూపర్ హీరో శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది.
తాను ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను రజినీకాంత్ ని ఇపుడు వరకు కలవబడం జరగలేదు అని కానీ రజినీకాంత్ బాలీవుడ్ లో ఉన్నటువంటి ఎంతోమంది స్టార్స్ కంటే బెటర్ అని కొనియాడారు. అలాగే మిగతా స్టార్స్ లా కాకుండా రజినీకాంత్ తన అభిమానులతో ఎప్పుడు స్వచ్చంగానే ఉంటారని ఎలాంటి మేకప్, విగ్ లాంటివి లేకుండా మసులుకుంటారని తన స్టార్డం చాలా పెద్దదని ముకేశ్ ఖన్నా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. మరి బాలీవుడ్ పట్ల తనకి ఎప్పుడు నుంచో ఉన్న అసహనాన్ని మరోసారి ఇలా తాను బయట పెట్టారని చెప్పవచ్చు.