ఇంటర్వ్యూ : శర్వానంద్ – యువి క్రియేషన్స్ నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది..!

ఇంటర్వ్యూ : శర్వానంద్ – యువి క్రియేషన్స్ నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది..!

Published on Aug 9, 2014 1:30 PM IST

sharvanand
‘యువసేన’తో నటుడిగా కెరీర్ ఆరంభించిన శర్వానంద్ మొదటి నుండి వైవిధ్యమైన కథలలో నటిస్తూ ఇతర హీరోలతో పోలిస్తే భిన్నమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు శర్వానంద్. ‘గమ్యం’, ‘ప్రస్థానం’, ‘జర్నీ’ ఇలా శర్వా నటించిన ప్రతి సినిమా రెగ్యులర్ కమర్షియల్ పడికట్టు సూత్రాలకు భిన్నమైన పంధాలో తెరకేక్కినవే. సినిమాలకు మంచి పేరు వచ్చినా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాయి. నటుడిగా విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ యువ హీరో ‘రన్ రాజా రన్’ సినిమాతో బాక్సాఫీస్ బరిలో దూసుకుపోతున్నాడు. స్ట్రాంగ్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. 10 ఏళ్ళ నుండి ఇటువంటి విజయం కోసమే ఎదురు చూశాను అంటున్న శర్వానంద్… తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇంకా శర్వానంద్ చెప్పిన విశేషాలు మీకోసం….

ప్రశ్న) ‘రన్ రాజా రన్’తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. మీ ఫీలింగ్ ఏంటి..?

స) నేను కమర్షియల్ హిట్ కొట్టాను అని చెప్పడం కంటే ‘యువి క్రియేషన్స్’ సంస్థ నాకొక కమర్షియల్ సక్సెస్ అందించింది. అని చెప్తే బాగుంటుంది. నా కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ సినిమా చేస్తున్నాను. నాకు ఎటువంటి ఇమేజ్ లేదు. శర్వా ఇటువంటి క్యారెక్టర్ చేయగలడు అని నమ్మి నాతో సినిమా చేశారు. ప్రమోద్, వంశిలకు థాంక్స్ చెప్తున్నాను. ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 10 ఏళ్ళ నుండి ఇటువంటి విజయం కోసం ఎదురుచూస్తున్నాను. ఒక మంచి యూత్ ఫుల్ క్యారెక్టర్, సినిమా చేశాను అనే ఫీలింగ్ ఉంది.

ప్రశ్న) ఈ 10 ఏళ్ళలో మీ దగ్గరకి యూత్ ఫుల్ స్క్రిప్ట్స్ రాలేదా..?

స) యూత్ ఫుల్ స్క్రిప్ట్స్ చాలా విన్నాను. లవ్ స్టోరీస్, రొమాంటిక్ సబ్జక్ట్స్ నా వద్దకు వచ్చాయి. కాని అవేవి నాకు అంతగా నచ్చలేదు. సుజీత్ ‘రన్ రాజా రన్’ సినిమా కథతో వచ్చినప్పుడు తప్పకుండా చేయాలి అని ఫిక్స్ అయ్యాను.

ప్రశ్న) దర్శకుడు సుజీత్ కి ఇది ఫస్ట్ సినిమా. మీకు కథ చెప్పిన తర్వాత ఏవైనా చేంజ్ చేయమని అడిగారా..?

స) సుజీత్ ఫస్ట్ కథ చెప్పగానే నాకు నచ్చింది. కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. అసలు ముందు కథను యువి క్రియేషన్స్ ప్రమోద్, వంశిలు విన్నారు. వాళ్ళకు బాగా నచ్చడంతో నా దగ్గరకు సుజీత్ ను పంపించారు. నేను ఇలాంటి క్యారెక్టర్ చేయగలనా..? అని సందేహించాను. సుజీత్ నన్ను చాలా బాగా చూపించాడు.

ప్రశ్న) ‘రన్ రాజా రన్’లో మీ స్టైలిష్ లుక్ వెనుక కారణం ఏంటి..? సినిమాలో మీకు బాగా నచ్చిందేంటి..?

స) ‘రన్ రాజా రన్’ సినిమా మొత్తం హైదరాబాద్లో షూట్ చేశాం. ఓన్లీ సాంగ్స్ బయట లొకేషన్స్ లో షూట్ చేశాం. సినిమా ఇంత కలర్ ఫుల్ గా ఉంది. శర్వా చాలా స్టైలిష్ గా కనబడుతున్నాడు అంటే కారణం సినిమాటోగ్రాఫర్ మది. నన్ను చాలా చాలా అందంగా చూపించాడు. సినిమాలో నాకు రాజా క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. ఫెంటాస్టిక్ స్క్రిప్ట్. ఒక ప్రేక్షకుడిగా సినిమా కథ విన్నప్పుడు నాకు అడవి శేష్ క్యారెక్టర్ లో ట్విస్ట్ బాగా నచ్చింది. తను బ్రిలియంట్ యాక్టర్. సినిమాలో అద్బుతంగా నటించాడు. జిబ్రాన్ తన సంగీతంతో సినిమాకు కొత్త లుక్ తీసుకొచ్చాడు. ఇంట్రడక్షన్ సీన్స్, పాటలలో కొత్త సౌండింగ్ వినిపించాడు. మ్యూజిక్ నాకు బాగా నచ్చింది.

ప్రశ్న) ‘రన్ రాజా రన్’ సినిమాతో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి..?

స) సినిమా విడుదలకు ముందు టాలీవుడ్ యంగ్ హీరోలతో పాటు, మీడియా & సగటు సినిమా అభిమాని ప్రతి ఒక్కరు శర్వా సినిమా హిట్ అవ్వాలి అని కోరుకున్నారు. అలాగే హిట్ అయిన తర్వాత యంగ్ హీరోలు అందరూ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే మా పేరెంట్స్ సినిమా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండే సినిమాలు చేయమని అడిగారు.

ప్రశ్న) ఇక ముందు ‘రన్ రాజా రన్’ లాంటి కమర్షియల్ సినిమాలే చేస్తారా..? లేక ‘ప్రస్థానం’ వంటి సినిమాలు కూడా చేస్తారా..?

స) కమర్షియల్ సినిమా, ఆర్ట్ ఫిల్మ్స్ అనే విషయాలు నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ 10 ఏళ్ళలో నటించిన సినిమాల వలనే నాకు ఈ ఇమేజ్ వచ్చింది. గతంలో నేను చేసిన సినిమాల పట్ల హ్యాపీగా ఉన్నాయి. ప్రతి ఆర్టిస్ట్ డిఫరెంట్ సినిమాలు, డిఫరెంట్ రోల్స్ చేయాలని కోరుకుంటాడు. ఒక సినిమా అంగీకరించే ముందు కథ బాగుందా..? లేదా..? అని మాత్రమె ఆలోచిస్తాను. కథ ముఖ్యం. మంచి కథలు దొరికితే భవిష్యత్ లో ‘ప్రస్థానం’ వంటి సినిమాలు గ్యారెంటీగా చేస్తాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ముఖ్యం అని తెలుసుకున్నాను.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..?

స) కెఎస్ రామారావు గారి బ్యానర్లో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మలేషియాలో ఒక షెడ్యూల్, కొన్ని పాటలు బాలన్స్ ఉన్నాయి. నిత్యా మీనన్ నాకు జంటగా నటిస్తుంది. ఈ సినిమా కంప్లీట్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ప్యూర్ లవ్ స్టొరీతో తెరకెక్కుతుంది. డిఫరెంట్ సినిమా అవుతుంది. అలాగే తమిళంలో ఓ సినిమా చర్చల దశలో ఉంది.

ప్రశ్న) ‘కో అంటే కోటి’తో నిర్మాతగా మారారు. మళ్లీ సినిమాలు నిర్మించే ఉద్దేశ్యం ఉందా..?

స) భవిష్యత్ లో సినిమాలు నిర్మిస్తాను. నేను నిర్మించే సినిమాలలో నటించాకూడని నిర్ణయం తీసుకున్నాను. నిర్మాతగా, హీరోగా రెండు భాద్యతలు నిర్వహించడం కష్టం. ప్రస్తుతానికి నిర్మాణం గురించి ఆలోచించడం లేదు.

ప్రశ్న) మీకు డ్రీం రోల్స్ ఏమైనా ఉన్నాయా..?

స) మంచి సినిమాలలో నటించాలి అనేది నా డ్రీం. అంతే తప్ప డ్రీం రోల్స్ వంటివి ఏమి లేవు.

భవిష్యత్ లో కూడా శర్వానంద్ మరిన్ని కమర్షియల్ విజయాలు అందుకోవాలని కోరుకుంటూ, యువ హీరోకి అల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

 

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు