“ఓజి” ఫస్ట్ సింగిల్ పై సాలిడ్ హైప్.!

“ఓజి” ఫస్ట్ సింగిల్ పై సాలిడ్ హైప్.!

Published on May 22, 2024 7:02 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా గత కొంత కాలం నుంచి ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలపాల్సి వచ్చింది.

అయితే అసలు ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వకపోయినా ఇప్పుడు ఓజి సినిమా ట్యాగ్ సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి ట్రెండ్ అవుతుంది. ఇది మెయిన్ గా సినిమా మొదటి సాంగ్ కోసమే అని తెలుస్తోంది. రీసెంట్ గా పలు భారీ సినిమాల తాలూకా ఫస్ట్ సింగిల్స్ వస్తున్నాయి.

ఇక ఈ సమయంలో ఓజి సిసలైన సాంగ్ కూడా వస్తే వేరే లెవెల్లో ఉంటుంది అని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆల్రెడీ థమన్ ఇచ్చిన హంగ్రీ చీతా బిట్ ట్యూన్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. దీనితో ఇప్పుడు అంతా ఫస్ట్ సింగిల్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ఇదెప్పుడు వస్తుంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు