“దేవర” రెండు పాటలపై కూడా సాలిడ్ అప్డేట్స్

“దేవర” రెండు పాటలపై కూడా సాలిడ్ అప్డేట్స్

Published on May 18, 2024 8:01 AM IST


ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సాంగ్ ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ (Devara) హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “దేవర” ఫస్ట్ సింగిల్ కోసమే అని చెప్పాలి. మరి ఈ సినిమాకి అనిరుద్ సంగీతం కావడంతో హైప్ మరింత స్థాయికి వెళ్ళింది.

ఇక ఈ భారీ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ (Devara First Single) ప్రోమో కూడా ఇన్స్టంట్ హిట్ కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి దేవర నుంచి రెండు పాటలపై సాలిడ్ అప్డేట్స్ అందించారు. ఫస్ట్ సింగిల్ అయితే అదిరిపోయింది అని తారక్ అభిమానులు పండుగ చేసుకుంటారు అనేట్టు పోస్ట్ చేశారు.

ఇక రెండో సాంగ్ పై పోస్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ కోత అయితే రెండో సాంగ్ లేత అంటూ సెకండ్ సింగిల్ ని ఒక మెలోడీగా కన్ఫర్మ్ చేశారు. దీనితో దేవర ఆల్బమ్ పై మరింత క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 10న గ్రాండ్ గా సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు