ఆడియో సమీక్ష : S/O సత్యమూర్తి – దేవీశ్రీ మరో డీసెంట్ ఆల్బమ్.

ఆడియో సమీక్ష : S/O సత్యమూర్తి – దేవీశ్రీ మరో డీసెంట్ ఆల్బమ్.

Published on Mar 17, 2015 10:45 AM IST

Son-Of-SatyaMurty
‘ఆర్య’, ‘బన్ని’, ‘ఆర్య 2’, ‘జులాయి’, ‘ఇద్దరమ్మాయిలతో’ ఇవన్నీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన మ్యూజికల్ గా హిట్స్. అలాగే ‘జల్సా’, ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా ‘S/O సత్యమూర్తి’. ఈ సినిమా ఆడియోని నిన్ననే హైదరబాద్ లో లాంచ్ చేసారు. మొత్తం 7 పాటలున్న ఈ ఆల్బంలో దేవీశ్రీ ప్రసాద్ మూడు పాటలు రాయడం విశేషం. మరి ఈ ఆల్బమ్ వీరి కాంబినేషన్ లో వచ్చిన మరో హిట్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

1. పాట : చల్ చలే చలోSon of Sathyamurthy (7)

గాయకులు : రఘు దీక్షిత్, సూరజ్ సంతోష్, రీట

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

‘S/O సత్యమూర్తి’ ఆల్బంలో వచ్చే మొదటి జోష్ ఫుల్ సాంగ్ ‘చల్ చలే చలో’. ప్రతి ఆల్బంలో దేవీశ్రీ టిపికల్ స్టైల్ లో ఉండే పాటలా ఈ సాంగ్ ఉంటుంది. అనగా వినగానే కనెక్ట్ అయిపోవడం. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి చాలా మీనింగ్ ఫుల్ లిరిక్స్ ఇచ్చాడు. ముఖ్యంగా పాట మధ్యలో రాసిన హిందీ లైన్స్ బాగున్నాయి. ఫేమస్ ఇండియన్ సింగర్ రఘు దీక్షిత్ చాలా బాగా ఈ పాటని పాడాడు, ఇతనికి సూరజ్ సంతోష్, రీటల వాయిస్ కూడా బాగా సెట్ అయ్యింది. ఈ పాటలో దేవీశ్రీ ఇండియన్ స్టైల్ లో చేసిన ఆర్కెస్ట్రా బాగుంది, ఈ పాట మద్య మధ్యలో దేవీశ్రీ గత సినిమాల్లోని కొన్ని పాటలని గుర్తు చేస్తాయి. ఫైనల్ గా చల్ చలే చలో అనే లైన్స్ మీకు బాగా కనెక్ట్ అవుతాయి.

Son of Sathyamurthy (6)2. పాట : వన్ & టు & త్రీ

గాయకుడు : సూరజ్ సంతోష్

సాహిత్యం : దేవీశ్రీ ప్రసాద్

ఈ ఆల్బంలో వచ్చే రెండవ సాంగ్ ‘వన్ & టు & త్రీ’ అంటూ సాగే పార్టీ సాంగ్. లేట్ నైట్ పార్టీ లైఫ్ లో యువత యొక్క జాయ్ ఫుల్ లైఫ్ గురించి చెబుతూ సాగే పార్టీ సాంగ్ ని దేవీశ్రీ ప్రసాద్ రాసాడు. ఈ పాట చాలా చిన్నదైనప్పటికీ ఈ పాటకి సూరజ్ సంతోష్ వాయిస్ మరియు దేవీశ్రీ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ ట్యూన్ అందరికీ బాగా నచ్చేస్తాయి. ఇదే ట్యూన్ ని ఫస్ట్ టీజర్ లో రిలీజ్ చేయడం వల్ల ఇప్పటికే చాలా మంచి కాలర్ ట్యూన్ గా కూడా మారిపోయింది. వినగా వినగా ఈ బిట్ సాంగ్ అందరికీ నచ్చుతుంది.

3. పాట : శీతాకాలంSon of Sathyamurthy (5)

గాయకుడు : యాజిన్ నిజార్

సాహిత్యం : శ్రీమణి

దేవీశ్రీ ప్రసాద్ ప్రతి ఆల్బంలోనూ ఓ మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ తప్పక ఉంటుంది. అలా ఈ ఆల్బంలో వచ్చే రొమాంటిక్ మెలోడీనే ‘శీతాకాలం’ సాంగ్. ఈ పాట ఆల్బంలో బెస్ట్ సాంగ్ గా నిలవచ్చు. దేవీశ్రీ ఇచ్చిన మెలోడియస్ ట్యూన్ వల్ల వినగానే ఈ పాట మీ మనసుకు హత్తుకుంటుంది. హీరో హీరోయిన్ ని ఊహించుకుంటూ తన ప్రేమని వర్ణిస్తూ సాగే ఈ పాటని శ్రీమణి చాలా బాగా రాసాడు. యాజిన్ నిజార్ వాయిస్ చాలా కొత్తగా ఉండడమే కాకుండా పాత మూడ్ కి బాగా సింక్ అయ్యింది. ముఖ్యంగా ఈ పాట మధ్యలో వచ్చే ఇంగ్లీష్ రాపో పాటకి ఇంకా అట్రాక్షన్ గా నిలిచింది. ఇది చార్ట్ బస్టర్ గా నిలుస్తుంది.

Son of Sathyamurthy (2)4. పాట : సూపర్ మచ్చి

గాయనీ గాయకులు : దేవీశ్రీ ప్రసాద్, శ్రావణ భార్గవి, మగిజిని మణిమారన్

సాహిత్యం : దేవీశ్రీ ప్రసాద్

దేవీశ్రీ ప్రసాద్ ఆల్బం అంటే దాన్లో అన్ని రకాల సాంగ్స్ మిక్స్ అయ్యుంటాయి. ముఖ్యంగా మాస్ సాంగ్స్ కి పెట్టింది పేరు. ఈ ఆల్బంలో వచ్చే మాస్ పాటే ‘సూపర్ మచ్చి’. తమిళ్ పదాలతో స్టార్ట్ అయ్యే ఈపాటలో వచ్చే సూపర్ మచ్చి లైన్ అందరికీ భీభత్సంగా కనెక్ట్ అవుతుంది. ఈ పాటకి దేవీశ్రీ ప్రసాద్ తన ట్రేడ్ మార్క్ మ్యూజిక్ ఇవ్వడమే కాకుండా ఈ పాటకి లిరిక్స్ ని అతనే రాసాడు. అలాగే ఈ పాటని కూడా తనే పాడాడు. దేవీశ్రీ ప్రసాద్ కి తోడుగా వాయిస్ ఇచ్చిన శ్రావణ భార్గవి, మగిజిని మణిమారన్ లు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమాకి అల్లు అర్జున్ మాస్ స్టెప్స్ తోడైతే ఆన్ స్క్రీన్ ఈ పాట సూపర్ హిట్ అవుతుంది. ముఖ్యంగా బి,సి సెంటర్ వారు పండుగ చేసుకునే పాట ఇది.

5. పాట : కమ్ టు ది పార్టీSon of Sathyamurthy (4)

గాయకుడు : విజయ్ ప్రకాష్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

సన్ ఆఫ్ సత్యమూర్తి ఆల్బంలో వచ్చే మరో పార్టీ సోలో సాంగ్ ‘కమ్ టు ది పార్టీ’. ఈ పార్టీ సాంగ్ లో హీరో తన పాత్రని గురించి వివరిస్తూనే, ఫుల్ పార్టీ మూడ్ లో సాగే పాట ఇది. పాప్ స్టైల్లో పూర్తి జాజ్ బీట్ తో సాగే ఈ పాట వింటున్న టైంలో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లోని ‘సంథింగ్ సంథింగ్’ పాటని గుర్తు చేస్తోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటని చాలా డిఫరెంట్ గా రాసారు. ఈ పాట మధ్యలో వచ్చే ‘ కమ్ టు ది పార్టీ సుబ్బలక్ష్మీ, వెల్ కమ్ టు ది అబ్బా టచ్ మీ’ అనే లైన్ వినేవారికి బాగా కనెక్ట్ అవుతుంది. విజయ్ ప్రకాష్ వాయిస్ లో పలు వేరియేషన్స్ ని చాలా బాగా పాడాడు.

Son of Sathyamurthy (1)6. పాట : జారుకో

గాయనీ గాయకులు : సాగర్, ఎంఎం మనసి

సాహిత్యం : శ్రీమణి

ఈ ఆల్బంలో వచ్చే ఆరవ సాంగ్, ‘జారుకో’ అంటూ సాగే ఈ ఫన్నీ సాంగ్ వింటున్నప్పుడు మీ పెదవి పైన చిన్న చిరునవ్వును తెస్తుంది. సాగర్ ఈ పాటని వినే వారికి బాకా కనెక్ట్ అయ్యేలా రాసాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సూపర్బ్ గా లేకపోయినా పాటలోని శ్రీమణి లైన్స్ లోని ఎంటర్టైనింగ్ గా వల్ల వినడానికి మాత్రం బాగానే ఉంటుంది. విజువల్స్ పరంగా ఈ సాంగ్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంది.

7. పాట : వచ్చాడుSon of Sathyamurthy (3)

గాయకుడు : జావేద్ అలీ

సాహిత్యం : దేవీశ్రీ ప్రసాద్

సన్ ఆఫ్ సత్యమూర్తి ఆల్బంలో వచ్చే చివరి సోలో మరియు హీరో ఎలివేషన్ సాంగ్ ‘వచ్చాడు వచ్చాడు’ అంటూ సాగుతుంది. ఈ సాంగ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సందర్భానుసారంగా వచ్చే సాంగ్. హీరోలోని వీరత్వాన్ని పొగుడుతూ పల్లెటూరి ప్రజలు పాడుకునే ఈ పాటని జావేద్ అలీ పవర్ఫుల్ గా పాడాడు. దేవీశ్రీ ప్రసాద్ ఈ పాటని సినిమాలో సందర్భానికి తగ్గట్టు బాగా రాసాడు. హీరోని ఎలేవేట్ చేసే సాంగ్ కదా అని మరీ హై బీట్స్ ని వాడకుండా సింపుల్ ట్రాక్స్ తో దేవీశ్రీ కంపోజ్ చేసిన బీట్స్ బాగున్నాయి. ఈ పాట వినగా వినగా బాగానే అనిపిస్తుంది.

తీర్పు :

అల్లు అర్జున్ – దేవీశ్రీ ప్రసాద్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘S/O సత్యమూర్తి’ మ్యూజిక్ ఆల్బం అందరి అంచనాలను అందుకునే స్థాయిలో లేకపోయినా డీసెంట్ ఆల్బంగా నిలిచింది. ఎప్పటిలానే దేవీశ్రీ మార్క్ ఉన్న కొన్ని సాంగ్స్ ఈ ఆల్బంలో ఉన్నాయి, అవి చార్ట్ బస్టర్స్ అవుతాయి. మా పరంగా చల్ చలే చలో, శీతాకాలం, సూపర్ మచ్చి మరియు వన్ & టు & త్రీ సాంగ్స్ బాగున్నాయి. మిగతావి ఆన్ స్క్రీన్ విజువల్స్ పరంగా బాగా ఆకట్టుకోవచ్చు.

S/O సత్యమూర్తి పాటల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Click here for S/o Satyamurthy English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు