ఓటిటి: కాంట్రవర్సీ గా మారిన స్టార్ హీరో కొడుకు డిజిటల్ ఎంట్రీ

ఓటిటి: కాంట్రవర్సీ గా మారిన స్టార్ హీరో కొడుకు డిజిటల్ ఎంట్రీ

Published on Jun 13, 2024 12:20 PM IST


ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సూపర్ స్టార్ హీరోస్ లో బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఒకడు. అయితే అమీర్ ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్నాడు కానీ తన నుంచి చాలా కాలంగా సరైన హిట్ లేదు. మరి ఇదిలా ఉండగా తన కొడుకు జునైద్ ఖాన్ సినిమా ఎంట్రీని కూడా అమీర్ ఎప్పుడో ప్లాన్ చేసాడు. అయితే జునైద్ ఖాన్ (Junaid Khan) హీరోగా నటించిన ఆ చిత్రమే “మహారాజ్” (Maharaj On Netflix).

అయితే నిజ జీవిత సంఘటల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా నేరుగా ఓటిటిలో రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ సినిమా ఫిక్స్ కాగా దిగ్గజ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గా ఎలాంటి ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేయకుండానే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కి అమ్మేసి ఈ జూన్ 14 నుంచే తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ అఫీషియల్ పోస్టర్ చూసాక హిందువులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ సినిమాలో హిందూ మతపర సాధువులని తప్పుడు కోణంలో చూస్పిస్తున్నారు. అయితే అప్పుడు పీకే (Amir Khan PK Movie) సినిమాలో హిందూ దేవుళ్ళని అమీర్ ఖాన్ హేళన గా చూపిస్తే ఇప్పుడు తన తండ్రి బాటలోనే జునైద్ కూడా హిందువుల మనోభావాలను దెబ్బ తీసేవిధంగా ప్రయత్నం చేస్తున్నాడు అని సోషల్ మీడియాలో ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలని గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు.

అంతే కాకుండా గతంలో స్టార్ నటి నయనతార (Nayanthara) నటించిన “అన్నపూర్ణ” (Annapoornai Netflix) చిత్రంలో కూడా హిందువుల మనోభావాలు దెబ్బ తీసే సన్నివేశాలు ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ వాళ్ళు కావాలనే ఈ తరహా కంటెంట్ తీసుకుంటుంన్నారు అని నెట్ ఫ్లిక్స్ కూడా బాయ్ కాట్ చేయాలి అంటూ కొంచెం ఘాటు కాంట్రవర్సీనే నడుస్తుంది. అయితే నయన్ సినిమాని నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించేవరకు ఎవరూ ఊరుకోలేదు. మరి ఇప్పుడు అమీర్ కొడుకు డిజిటల్ ఎంట్రీకి కూడా అదే గతి పడుతుందో ఏమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు