టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం హరోం హర. ది రివోల్ట్ అనేది ఉప శీర్షిక. పాన్ ఇండియా స్టోరీ నేపథ్యంలో సుధీర్ కెరీర్ 18వ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా కథనందిస్తూ డైరెక్ట్ చేస్తుండగా మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన కాన్సెప్ట్ టైటిల్ వీడియో, పోస్టర్‌కు అలానే చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన కనులెందుకో సాంగ్ కి మంచి రెస్పాన్స్ లభించాయి.
అయితే సుబ్రహ్మణ్యం మాస్ సంభవం లోడింగ్ అంటూ నిన్న రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగా దీనిలో తమ మూవీ రిలీజ్ డేట్ ఉందని హింట్ ఇచ్చారు సుధీర్. విషయం ఏమిటంటే అందరూ భావించిన విధంగా సుధీర్ బాబు మావయ్య లెజెండరీ సూపర్ స్టార్ గారి జయంతి రోజైన మే 31న తమ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు.
1989 బ్యాక్ డ్రాప్లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు. ఇక హరోం హర తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.