సెన్సార్ పూర్తి చేసుకున్న సుహాస్ “ప్రసన్నవదనం”

సెన్సార్ పూర్తి చేసుకున్న సుహాస్ “ప్రసన్నవదనం”

Published on Apr 30, 2024 4:46 PM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్నవదనం. మే 3, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే రన్ టైమ్ పై క్లారిటీ రావాల్సి ఉంది.

అర్జున్ YK దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ మరియు రాశి సింగ్ కథానాయికలుగా నటించారు. నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రంకి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు