సందీప్ కిషన్ 30 వ చిత్రం షూటింగ్ ప్రారంభం!


సందీప్ కిషన్ చివరిసారిగా వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఊరు పేరు భైరవకోన అనే ఫాంటసీ డ్రామాలో కనిపించాడు. తదుపరి జూలై 26న విడుదల కానున్న ధనుష్ యొక్క రాయన్‌లో అతను కీలక పాత్రలో కనిపించనున్నాడు. ధమాకా చిత్రం దర్శకుడు త్రినాధరావు నక్కినతో ఈ ప్రామిసింగ్ నటుడు చేతులు కలిపాడు, ఇది సందీప్ కెరీర్‌లో 30వ చిత్రం. తాత్కాలికంగా SK30 అని పేరు పెట్టబడిన ఈ చిత్రం కొన్ని రోజుల క్రితం అధికారికంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. SK30 ప్రేమ మరియు భావోద్వేగాలతో నిండిన ఎమోషనల్ ఎంటర్టైనర్. ఎంటర్టైనర్‌లను రూపొందించడంలో త్రినాథరావు నక్కినకు సాలిడ్ ట్రాక్ రికార్డ్ ఉంది. మరి SK30 ఎలా రూపొందుతుందో చూడాలి. ధమాకా విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.