ఒకే రోజు 2 రిలీజ్ లతో తెలుగు యంగ్ హీరోయిన్

ఒకే రోజు 2 రిలీజ్ లతో తెలుగు యంగ్ హీరోయిన్

Published on Jun 13, 2024 10:01 AM IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోయిన్స్ లో ఇప్పుడిప్పుడే తెలుగు హీరోయిన్స్ కి డీసెంట్ అవకాశాలు దొరుకుంటున్నాయి. మరి అలా ఉన్న యువ హీరోయిన్స్ లలో చాందిని చౌదరి కూడా ఒకరు. మరి తెలుగులో “కలర్ ఫోటో” తో మంచి బ్రేక్ ని అందుకున్న ఈమె రీసెంట్ గా “గామి” తో మరో హిట్ అందుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత మరిన్ని సినిమాలు ఈమె ఇప్పుడు చేస్తుండగా లేటెస్ట్ గా ఈ ఫ్రైడే రిలీజ్ లలో రెండు సినిమాలు ఈమెవి వస్తుండడం విశేషం.

చాందిని అలాగే నటుడు అజయ్ ఘోష్ కాంబినేషన్ లో నటించిన చిత్రం “మ్యూజిక్ షాప్ మూర్తి” ఒకటి కాగా మరో చిత్రం దర్శకుడు దంతులూరి తెరకెక్కించిన చిత్రం పోలీస్ థ్రిల్లర్ డ్రామా “యేవం” కూడా రేపే రాబోతుంది. దీనితో ఈమె ఒకే రోజు రెండు సినిమాలు ఆమె నుంచి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఈ సినిమాలు తర్వాత తెలుగులో సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమా ఆమె చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు