బజ్.. “వీర సింహారెడ్డి” తరహాలోనే “బాలయ్య 109” కి కూడా!?

టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) కూడా ఒకరు. మరి బాలయ్య హీరోగా ఇప్పుడు తన కెరీర్ 109వ సినిమా (NBK 109) చేస్తుండగా ఈ సినిమా కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాకి ముందు బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ కొట్టడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ చిత్రాల్లో దర్శకుడు గోపీచంద్ మలినేనితో ప్లాన్ చేసిన “వీర సింహారెడ్డి” కి ప్లాన్ చేసిన తరహాలోనే బాలయ్య 109 కి కూడా టైటిల్ విషయంలో ప్లాన్ చేస్తున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. ఆ సినిమా టైటిల్ ని ఓ గ్రాండ్ ఈవెంట్ పెట్టి వీరసింహా రెడ్డి అంటూ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ని బాలయ్య 109 కి కూడా ఫాలో అవుతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక బాలయ్య 109 ని బాబీ కొల్లి తెరకెక్కిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.