దాదాపు అన్ని చోట్లా స్ట్రాంగ్ గా “మహారాజ”

కోలీవుడ్ వెర్సటైల్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తన కెరీర్ మైల్ స్టోన్ సినిమా 50వ సినిమాగా దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “మహారాజ”. మరి మంచి కంటెంట్ ఉంటే ఆడియెన్స్ పట్టం కడతారు అని చాలా కాలం తర్వాత ప్రూవ్ చేసిన సినిమా ఇది అని చెప్పాలి.

ఇక ఈ సినిమా తెలుగు సహా తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యి ఒక ఊహించని లెవెల్ పెర్ఫామెన్స్ ని చేస్తుంది. అయితే ఈ సినిమా వీక్ డేస్ లో కూడా దాదాపు విడుదల అయ్యిన అన్ని చోట్లా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తుండడం విశేషం. తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యూఎస్ మార్కెట్ లో కేరళ లో కూడా ఈ చిత్రం ఎక్సలెంట్ హోల్డ్ తో దూసుకెళ్తుందట.

మొత్తానికి అయితే విజయ్ సేతుపతి చేసిన ఈ సాలిడ్ ఎమోషనల్ మరియు రివెంజ్ డ్రామా మంచి హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా జగదీశ్ ఫలనిసామి, సుధన్ సుందరం నిర్మాణం వహించారు.