మురళీధరన్ కోరిక మేరకు బయోపిక్ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి

మురళీధరన్ కోరిక మేరకు బయోపిక్ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి

Published on Oct 19, 2020 9:18 PM IST


తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మీద గత కొన్ని రోజులుగా తమిళ జనం తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’లో సేతుపతి లీడ్ రోల్ చేయనున్నాడనే వార్త అధికారికంగా బయటకు రావడం, ఫస్ట్ లుజ్ టీజర్ విడుదలైన రోజు నుండి సేతుపతి మీద వ్యతిరేకత మొదలైంది. మురళీధరన్ తమిళుడు అయ్యుండి కూడ ప్రభాకరన్ పోరాటానికి మద్దతివ్వలేదని, అలాంటి వ్యక్తి జీవితం మీద తీయబోయే సినిమాలో విజయ్ సేతుపతి నటించడం సరైంది కాదని అనేక మంది తప్పుబట్టారు. సోషల్ మీడియాలో బాయ్ కాట్ విజయ్ సేతుపతి, తమిళ ద్రోహి విజయ్ సేతుపతి, షేమ్ ఆన్ యు విజయ్ సేతుపతి అంటూ పెద్ద ఎత్తున ట్రైండ్ చేశారు.

దీంతో పలువురు ప్రముఖులు రాజకీయ పరమైన గొడవలు చెలరేగే అవకాశం ఉందని, కాబట్టి ప్రాజెక్ట్ వదిలేయమని సేతుపతికి సూచించారు. అయినా ఆయన ఏం మాట్లాడలేదు. చివరికి మురళీధరన్ స్వయంగా ‘నా జీవితం మీద తీసే సినిమా వర్థమాన క్రికెటర్లకు ఉపయోగపడుతుందని అనుకున్నాను. అందుకే ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. కానీ నటుడు విజయ్ సేతుపతి మీద ఒత్తిడి తీవ్రమైంది. ఆయన భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదనే ఉద్దేశ్యంతో ఆయన్ను సినిమా నుండి తప్పుకోమని, ఎలాంటి టెంక్షన్ లేకుండా ఇతర ప్రాజెక్ట్స్ మీద పూర్తి దృష్టి పెట్టమని కోరుతున్నాను అంటూ లేఖ రిలీజ్ చేశారు. విజయ్ సేతుపతి కూడ మురళీధరన్ లేఖను అంగీకరిస్తున్నట్టు సోషల్ మీడియాలో కన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఎప్పటికైనా ఈ ప్రాజెక్టును చేయడం ఖాయమని మురళీధరన్ హింట్ ఇవ్వడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు