మరి “కల్కి” లో కలి ఎవరు? ఈ లాజిక్ ప్రకారం చూస్తే..

మరి “కల్కి” లో కలి ఎవరు? ఈ లాజిక్ ప్రకారం చూస్తే..

Published on Jun 21, 2024 1:58 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా, దిశా పటాని (Disha Patani) లు హీరోయిన్స్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ “కల్కి 2898 ఎడి” కూడా ఒకటి. అయితే ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేసి తెరకెక్కించాడు.

ఇప్పటికే వచ్చిన ట్రైలర్ తో సాలిడ్ ట్రీట్ ని అందించగా రిలీజ్ కి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ థియరీలు వైరల్ గా మారాయి. అలా ఈ సినిమాలో కల్కి పాత్ర ప్రభాసా కాదా అనేది మొదటి ఆసక్తికర ప్రశ్నగా మారగా నెక్స్ట్ విలన్ గా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన పాత్ర పై కూడా ఇప్పుడు మంచి సస్పెన్స్ జెనరేట్ అయ్యింది.

అయితే సినిమాలో ప్రభాస్ భైరవ అయినప్పటికీ కల్కి గా మారుతాడు అని బజ్ ఉంది. అలాగే ఇదే లాజిక్ ప్రకారం చూస్తే యాస్కిన్ గా పిలవబడే కమల్ హాసన్ రోల్ కల్కి కి విరోధి అయిన కలి కూడా కాకపోవడానికి ఛాన్స్ లేదుగా? మరి ఇలా అయితే కలి పాత్రని పోషిస్తుంది కమల్ అనే చెప్పాలి. మరి వీటి అన్నింటిపై క్లారిటీ రావాలి అంటే ఈ జూన్ 27 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు