సమీక్ష : అబ్బాయితో అమ్మాయి – యువతకు మాత్రమే.!

సమీక్ష : అబ్బాయితో అమ్మాయి – యువతకు మాత్రమే.!

Published on Jan 2, 2016 11:35 AM IST
Abbayitho Ammayi review

విడుదల తేదీ : 01 జనవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : రమేష్ వర్మ

నిర్మాత : జె. వందన అలేఖ్య, కిరీటి.పి, శ్రీనివాస్.ఎస్

సంగీతం : ‘మాస్ట్రో’ ఇళయరాజా

నటీనటులు : నాగ శౌర్య, పలక్ లల్వాని..


రొమాంటిక్ లవ్ స్టోరీస్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా ‘ఒక ఊరిలో’, ‘వీర’ లాంటి సినిమాలను మనకందించిన రమేష్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఓ క్యూట్ లవ్ స్టొరీ ‘అబ్బాయితో అమ్మాయి’. పలక్ లల్వానీ హీరోయిన్ గా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ప్రేమకి – ఆకర్షణకి అలాగే నిజ జీవితం – వర్చువల్ లైఫ్ కి మధ్య ఉన్న చిన్న తేడాని చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఈ సినిమా.. కథలోకి వెళితే అభి(నాగ శౌర్య). అందరిలానే ఓ మంచి గర్ల్ ఫ్రెండ్ ని లైన్ లోపెట్టాలని ట్రై చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలోనే సమంత అనే ఓ తెలియని అమ్మాయితో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకుంటాడు. ఫ్రెండ్స్ గా అది సాగుతున్న టైంలో అభి ప్రార్ధన(పలక్ లల్వాని)ని చూసి ప్రేమలో పడతాడు. కట్ చేస్తే కొద్ది రోజులకి ఫ్రెండ్స్ అవుతారు, ఆ తర్వాత ఇద్దరూ ప్రేమికులవుతారు.

ఆ సమయంలో అభి కోసం ప్రార్ధన ఏ అమ్మాయి చేయని విధంగా అభికి తనని తానూ అర్పించుకుంటుంది. కట్ చేస్తే ఈ విష్యం ఇద్దరి ఫామిలీస్ కి తెలిసి సమస్య పెద్దదవుతుంది. అప్పుడే ప్రార్ధనకి అభి గురించి ఓ నిజం తెలుస్తుంది. దాంతో అభికి దూరంగా ఉంటుంది ప్రార్ధన. అదే టైములో ప్రార్ధన తన ఫేస్ బుక్ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ కి దగ్గరవుతుంది. ఫైనల్ గా తన తప్పు తెలుసుకున్న అభి మళ్ళీ ప్రార్ధన ప్రేమని పొందడానికి ఏమేమి చేసాడు.? చివరికి ప్రార్ధనని కలుసుకున్నాడా? లేదా? ఇంతకీ ప్రార్ధనకి అభి గురించి తెలిసిన నిజం ఏమిటి? ఇంతకీ ఈ పవన్ కళ్యాణ్ – సమంతలు ఎవరు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే లీడ్ పెయిర్ అయినా హీరో – హీరోయిన్ సెలక్షన్ అనే చెప్పాలి.. ఈ రొమాంటిక్ లవ్ స్టొరీకి నాగ శౌర్య – పలక్ లల్వానిలు ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. నాగ శౌర్య యంగ్ అండ్ ఎనర్జిటిక్ కుర్రాడిగా బాగా చేసాడు. లవ్, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని హావ భావాలను బాగా పలికించాడు. ఇక హీరోయిన్ పలక్ లల్వానికి ఇది తొలి సినిమా.. కెమెరా ఫియర్ లేకుండా చాలా బాగా చేసింది. ముఖ్యంగా తన స్క్రీన్ ప్రెజన్స్ అండ్ లిప్ సింక్ బాగా సెట్ అయ్యింది. మొదటి సినిమాలోనే మంచి నటనని కనబరిచింది. ఇదంతా ఒక ఎత్తైతే తను సినిమా మొత్తం బాగా గ్లామరస్ గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు ఎక్కువగా చేసిన స్కిన్ షో చాలా మందిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పాటల్లో అయితే పలక్ లల్వానిని చాలా గ్లామరస్ గా ప్రెజంట్ చేసారు.

ఇకపోతే సీనియర్ నటులైన మౌనరాగం ఫేం మోహన్, రావు రమేష్, ప్రగతి, తులసిలు వారి వారి పాత్రల్లో చక్కని ఎమోషన్స్ చూపారు. ఇక రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్ తో సినిమాని ప్రారంభించిన ఇంట్రడక్షన్ బాగుంది. సినిమా ప్రారంభంలో నాగ శౌర్య – లాస్య – శకలక శంకర్ కాంబినేషన్ లో వచ్చే మూడు సీన్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. అలాగే ఫాదర్ అండ్ సన్ అయిన నాగ శౌర్య – మోహన్ ల మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్ లో రావు రమేష్ సీరియస్ పాత్ర నుంచి చేంజ్ అయ్యాక తనలోని కామెడీ యాంగిల్ ని బయటపెడుతూ ఓ రెండు సీన్స్ చేసాడు. ఆ సీన్స్ బాగా నవ్విస్తాయి. అలాగే హీరో – హీరోయిన్ మధ్య అవచ్చే రొమాంటిక్ సీన్స్ యువతని ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో మధు – రావు రమేష్ మధ్య వచ్చే సీన్ కూడా నవ్విస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ రన్ టైం. సుమారు 145 నిమిషాల రన్ టైం ఈ సినిమాని బాగా స్లో చేసేసింది. చెప్పాలంటే ఈ సినిమాని కేవలం 2 గంటల్లో చెప్పడానికి ట్రై చేసి ఉంటే బాగుండేది. మెయిన్ గా దర్శకుడు రమేష్ వర్మ అనుకున్న మెయిన్ స్టొరీ లైన్ బాగుంది కానీ ఆ లైన్ ని బేస్ చేసుకొని ఆయన రాసుకున్న పూర్తి కథ బాలేదు అనే చెప్పాలి. బాలేదు అని ఎందుకు అన్నాను అంటే ఆయన అనుకున్న పాయింట్ నే ఆయన సినిమాలో పర్ఫెక్ట్ గా చెప్పలేకపోయాడు. క్లైమాక్స్ ని సరిగా ఆడియన్స్ కి అర్థమయ్యేలా జస్టిఫై చేయలేకపోయారు..ఇక కథ తర్వాత కథనం విషయానికి వస్తే.. కథనం మరింత ఊహాజనితంగా సాగడమే కాకుండా.. చాలా స్లోగా కూడా ఉంటుంది.

ఓ మంచి రొమాంటిక్ సీన్ తర్వాత హీరో – హీరోయిన్ విడిపోతారు. ఆ విడిపోయిన పాయింట్ చాలా బలంగా ఉండాలి ఎందుకంటే అదే పాయింట్ మీద సెకండాఫ్ ని నడిపించాలి. కానీ ఆ పాయింట్ స్ట్రాంగ్ గా లేకపోవడమే కాకుండా, ఆడియన్స్ కి సరిగా రీచ్ అవ్వలేదు. ఫాదర్ – సన్, ఫాదర్ – డాటర్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ని సరిగా చెప్పలేకపోయాడు. ఇకపోతే ఈ సినిమాలో పాటలు వరుసగా వస్తూ ఉంటాయి, విజువల్స్ పరంగా బాగున్నప్పటికీ, సినిమా పరంగా మాత్రం సినిమా వేగాన్ని తగ్గించి ఫ్లోని చెడగొట్టడానికే వస్తున్నట్టు ఉంటాయి.

సాంకేతిక విభాగం :

శాం కె నాయుడు ప్రతి ఒక్క షాట్ మరియు ప్రతి ఒక్క సీన్ ని అందమైన పెయింటింగ్ లా షూట్ చేసాడు. ఒకటి రెండు పాటలు తప్ప, లొకేషన్స్ అన్నీ హైదరాబాద్ లోనే సెలక్ట్ చేసుకున్నారు. కానీ ప్రతో ఒక్క ప్లేస్ ని చాలా కలర్ఫుల్ గా చూపించాడు. ఇక మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించాడు. రీ రికార్డింగ్ పరంగా కూడా ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు. బ్రహ్మకడలి ఆర్ట్ వర్ర్క్ బాగుంది. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. ఆయన చాలా సాగుతుంది అని తెలిసినా ఎక్కడా కట్ చేయడానికి ప్రయత్నించలేదు.

ఇక ఈ సినిమాకి కెప్టెన్ గా నిలిచిన రమేష్ వర్మ విషయానికి వస్తే.. కథ – కథకోసం ఎంచుకున్న లైన్ బాగున్నా పూర్తి కథ ఆకట్టుకునేలా లేదు.. కథనం – చాలా ఊహాజనితంగా, ఆడియన్స్ కి బోర్ కొట్టించేలా ఉంది. మాటలు – కొన్ని చోట్ల చాలా బాగున్నాయి… దర్శకత్వం – నటీనటుల నుంచి మంచి నటనని రాబట్టుకున్నాడు. కమర్షియల్ యనగిల్ లో ఆలోచించడం వలన అనుకుంటా చెప్పాలనుకున్న పాయింట్ ని సరిగా చెప్పలేకపోయాడు. అందుకే ఆధ్యంతం ఆడియన్స్ ని ఆకట్టుకోలేక కొన్ని సీన్స్ తో మాత్రమే మెప్పించాడు. ఇక పోతే నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో నాగ శౌర్య మరోసారి ‘అబ్బాయితో అమ్మాయి’ అనే లవ్ స్టొరీతో డీసెంట్ మూవీని అందించాడు. నాగ శౌర్య మరోసారి లవ్ స్టోరీస్ కి బాగా సెట్ అవుతాడని మరోసారి ‘అబ్బాయితో అమ్మాయి’తో మరోసారి ఋజువైంది. చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉండడం వలన ఈ సినిమా యూత్ ప్రేక్షకులకి బాగానే రీచ్ అయ్యింది. నాగ శౌర్య – పలక్ లల్వానిల నటన, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, యూత్ కి నచ్చే కొన్ని అంశాలు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. రన్ టైం ఎక్కువ అవ్వడం, అనుకున్న పాయింట్ ని సరిగా చెప్పలేకపోవడం, పాటలు ఎక్కువ అవ్వడం లాంటి విషయాలు సినిమాకి చాలా పెద్ద మైనస్. ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా నేటితరం యువతను ఆకట్టుకునే సినిమా.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు